GMA: రాజమౌళి ఓ ఇండియన్ స్పీల్‌బర్గ్.. టాక్ షోలో రామ్‌చరణ్ పంచుకున్న విశేషాలు

YouSay Short News App

‘గుడ్ మార్నింగ్ అమెరికా3’టాక్‌ షోలో పాల్గొన్న తొలి తెలుగు నటుడిగా రామ్‌చరణ్ చరిత్ర లిఖించాడు.. కొద్ది సేపు మాత్రమే షో లో గడిపిన రామ్‌చరణ్.. కొన్ని విషయాలను పంచుకున్నాడు.

ఇద్దరి వ్యక్తుల మధ్య స్నేహం, సౌభ్రాతృత్వం, బంధుత్వం గురించి వివరించేదే ‘ఆర్ఆర్ఆర్’. రామ్, భీమ్ పాత్రల చిత్రీకరణ ఎంతో అద్భుతం.

‘ఆర్ఆర్ఆర్’ గొప్ప సినిమా

దర్శకుడు రాజమౌళికే ఈ ఘనత దక్కుతుంది. ఆయన్ని మేం ఇండియన్ స్టీవెన్ స్పీల్‌బర్గ్‌గా పిలుస్తుంటాం. రానున్న కాలంలో రాజమౌళి గ్లోబల్ రేంజ్ సినిమా తీయగలడనే గట్టి నమ్మకం ఉంది.

దర్శకుడి ప్రతిభే

‘నాటు నాటు’ పాట ఆస్కార్ రేసులో నిలవడం  గొప్ప విశేషం. గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం, ఆస్కార్ అకాడమీ నామినేట్ చేయడం చాలా సంతోషాన్నిచ్చింది.

ఆస్కార్ నామినేషన్స్..

‘ఆర్ఆర్ఆర్’కు ఎన్నో అవార్డులు వస్తున్నాయి. ఇది కేవలం ‘ఆర్ఆర్ఆర్’ బృందానికే కాదు.. భారతీయ సినిమాకే గర్వకారణం. ఇది ఇండియన్ సినిమా సాధించిన విక్టరీ. భారతీయ టెక్నిషియన్ల గొప్పతనానికి ఇది ప్రతీక.

ఇండియన్ విక్టరీ..

ఇండియాలో ఘన విజయం సాధించాక అన్నీ సాధించేశామని భావించాం. మా తర్వాతి చిత్రాలపై దృష్టి పెట్టాలని ప్లాన్ చేసుకున్నాం. కానీ, పాశ్చాత్య దేశాలకు సినిమా విస్తరించడంతో సీన్ మారింది. ఇది ఆరంభం మాత్రమే.

ఇది ఆరంభమే..

షో లో తన స్వాగ్ గురించి, కూర్చున్న విధానం గురించి  హోస్ట్ మాట్లాడుతుండగా.. నేను కాస్త వినయంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నానని చెర్రీ బాంబ్ పేల్చాడు. దీంతో షో లో నవ్వులు పూచాయి.

వినయంగా నటిస్తున్నా..

నేను, ఉపాసన ఇన్నాళ్ల పాటు సంతానంపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు కుదిరింది.

తండ్రి కావడంపై..

‘నాటు నాటు’ పాట ఆస్కార్‌ ప్రమోషన్లలో భాగంగా రామ్‌చరణ్ ఈ షోలో పాల్గొన్నాడు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఈ పాట ఆస్కార్‌కు పోటీపడుతోంది. ‘నాటు నాటు’ పాటకి ‘గోల్డెన్ గ్లోబ్ అవార్డు’  దక్కిన విషయం తెలిసిందే.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.