RRRకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు

YouSay Short News App

చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్స్

గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు దక్కించుకున్న RRR చిత్రబృందానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతూ వారిని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మకమైన  అంతర్జాతీయ అవార్డు దక్కడం పట్ల చిరంజీవి నుంచి రామ్ గోపాల్‌ వర్మ వరకు అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశానికే గర్వకారణమని కొనియాడారు.

RRR చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావటం సంతోషంగా ఉంది. ఇదొక అద్భుతమైన చారిత్రక విజయం, దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది.

చిరంజీవి

ఇదొక గుర్తుండిపోయే విజయం. చరిత్ర సృష్టించిన RRR యూనిట్‌కు, కీరవాణికి కంగ్రాట్స్‌.

వెంకటేశ్‌

భారత సినిమాను ప్రపంచం మెుత్తం మెచ్చుకోవటం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఈ ఘనత సాధించిన చిత్రబృందానికి అభినందనలు.

మమ్ముట్టి

భారత చలన చిత్ర పరిశ్రమ కల నెరవేరింది.  ఈ ఏడాదికి ఇంతకన్న గొప్ప ప్రారంభం ఉండదేమో. చిత్రబృందానికి శుభాకాంక్షలు.

మహేశ్‌ బాబు

గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు రావటంతో దేశం మెుత్తం గర్విస్తోంది. ఆస్కార్‌ అవార్డు కూడా రావాలని ఆశిస్తున్నా.

పవన్ కల్యాణ్

నిద్రలేవగానే నాటు నాటు పాటకు డాన్స్‌ చేస్తూ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్ రావటాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి అవార్డులు ఎన్నో రావాలి.  దేశ ప్రతిష్ఠ పెరగాలి.

షారుఖ్ ఖాన్

రాజమౌళి అంటే సుకుమార్‌కు ప్రత్యేక అభిమానం. అవార్డురావటంపై మై హీరో అని రాజమౌళి ఫొటో షేర్‌ చేస్తూ  పోస్ట్ పెట్టారు.

సుకుమార్

నా క్షణ క్షణం సంగీత దర్శకుడికి దక్కిన అరుదైన గౌరవం గోల్డెన్ గ్లోబ్‌ అవార్డు. కీరవాణి ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి.

రామ్‌ గోపాల్‌ వర్మ

కీరవాణి గారికి భారతీయులతో పాటు ఆయన ఫ్యాన్స్ అందరి తరఫున శుభాకాంక్షలు.

ఎ.ఆర్. రెహమాన్‌

నా జీవితంలో మర్చిపోలేని క్షణాలివి. ఈ పాటకు చేసిన తపస్సును భగవంతుడే ప్రత్యక్షమై ఇచ్చిన వరం, ఈ పురస్కారం.

చంద్రబోస్‌

ప్రజలందర్ని పాడించడంతో పాటు ఆడించే శక్తి ఉన్న దేశమని ప్రపంచానికి దేశ ఖ్యాతిని చాటి చెప్పారు. వసుదైవ కుటుంబం.

ఆనంద్‌ మహీంద్రా

ఎట్టకేలకు భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. చిత్రబృందానికి అభినందనలు.

ప్రకాశ్ జవడేకర్