‘RRR’ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుతొలి భారతీయ చిత్రంగా చరిత్ర
‘RRR’ విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు
ఈ సినిమా హంగామా కొనసాగుతోంది. అంతర్జాతీయస్థాయిలో దుమ్ము లేపుతున్న చిత్రం మరో ప్రతిష్ఠాత్మకమైన అవార్డు సొంతం చేసుకుంది.
అంతర్జాతీయ గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఆర్‌ఆర్‌ఆర్‌ను వరించింది. ఇందులోని నాటు నాటు పాటకు బెస్ట్ ఓరిజినల్ సాంగ్ పురస్కారం దక్కింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.
గతేడాది మార్చిలో RRR చిత్రం విడుదలయ్యింది. దాదాపు సంవత్సరం అవుతున్న ఇప్పటికీ సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తునే ఉంది.. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు ఖ్యాతిని విస్తరిస్తోంది.
సంచలనాలకు కేరఫ్ అడ్రస్
RRR అవార్డుల్లోకి మరో పురస్కారం చేరింది. సినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ బెస్ట్ ఒరిజనల్ సాంగ్ అవార్డు వరించింది.
ప్రతిష్టాత్మక పురస్కారం.
గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకున్న మెుట్టమెుదటి భారతీయ సినిమాగా ఆర్ఆర్‌ఆర్ చరిత్ర సృష్టించింది.
తొలి అవార్డు
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో మరో కేటగిరీలోనూ
RRR పోటీ పడింది. బెస్ట్ నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో నామినేట్ అయినప్పటికీ పురస్కారం దక్కలేదు. అర్జెంటీనా 1985 అనే డ్రామాకు అవార్డు ఇచ్చారు.
జస్ట్ మిస్
కాలిఫోర్నియాలో ది బెవర్లీ హిల్టన్ హాల్ వేదికగా జరిగిన కార్యక్రమంలో రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబ సమేతంగా హాజరై సందడి చేశారు.
అమెరికాలో RRR
చిత్రానికి సంగీతం అందించిన ఎం.ఎం. కీరవాణి అవార్డును అందుకున్నారు. పాట రచించిన చంద్రబోస్‌తో పాటు ఆలపించిన కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ వరకు కృతజ్ఞతలు తెలిపారు.
కీరవాణి రాగంలో
చంద్రబోస్ ఈ పాట రాయటానికి మూడ్రోజులే పట్టినా.. పూర్తి చేయటానికి దాదాపు 19 నెలలు పట్టిందట. కీరవాణి, రాజమౌళి దాదాపు 30 వెర్షన్స్ రాయించారని చెప్పాడు.
19 నెలలు
ప్రపంచవ్యాప్తంగా RRRకు ఆదరణ లభిస్తోంది. ఇటీవల న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళి ఎంపికయ్యారు. ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్‌లోనూ RRR చోటు దక్కించుకుంది.
RRRకు అంతర్జాతీయ అవార్డులు
అమెరికాకు చెందిన హాలీవుడ్ ఫారెన్ ప్రెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 1944 నుంచి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయంగా సినిమా- టెలివిజన్ రంగంలో ఉత్తమ నటన ప్రదర్శించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులు అందిస్తారు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అంటే?
ఆస్కార్ తర్వాత అంత ప్రతిష్టాత్మకమైన అవార్డుగా దీనిని సినీరంగంలో నటీనటులు భావిస్తారు. గోల్డెన్ గ్లోబ్ సాధిస్తే… ఆస్కార్ కూడా వస్తుందనేది చాలా వరకు నమ్మకం