YouSay Short News App

GRAMMYS 2023:  రికార్డ్‌ సృష్టించిన ‘క్వీన్‌ బే’ బియాన్సె

అభిమానులు ముద్దుగా క్వీన్ బే అని పిలుచుకునే ఆమె స్వర సంగీత మాధుర్యానికి కోట్ల అభిమానులు. ఆమె పాటలకు అవార్డుల పంటలు. సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గ్రామీ అవార్డ్స్‌లో బియాన్సె సరికొత్త చరిత్ర లిఖించింది.

లాస్‌ ఏంజెల్స్‌లో జరిగిన 65వ గ్రామీ అవార్డ్స్‌ వేడుకలో బియాన్సె తన 32వ గ్రామీ అవార్డు అందుకుని… అత్యధికంగా ఈ అవార్డు గెలుచుకున్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పింది.

సాగరకన్యలా వస్త్ర, కేశాలంకరణలో అవార్డు స్వీకరించిన క్వీన్‌ బే..తన వెనకుండి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, భర్త, పిల్లలకు ధన్యవాదాలు చెప్పింది.

ఆమె కెరీర్‌లో ఇప్పటిదాకా 1362 సార్లు వివిధ అవార్డులకు నామినేట్‌ కాగా 543 పురస్కారాలు దక్కించుకుంది. అందులో 32 గ్రామీ అవార్డులున్నాయి.

2001లో మొదటిసారి ‘Say My Name’ పాటకు బియాన్సె రెండు గ్రామీ అవార్డులు గెలుచుకుంది.

2002లో Survivor పాటకు ఆమెను గ్రామీ వరించింది.

2004లో ఏకంగా 5 గ్రామీ అవార్డులు దక్కించుకుంది. Dangerously in Love, Dangerously in Love2, "The Closer I Get to You"  Crazy in Love పాటలకు వివిధ విభాగాల్లో అవార్డులొచ్చాయి.

2006లో So Amazing" 2007లో B'Day పాటలకు ఈ అందాల సుందరిని గ్రామీ వరించింది.

2010లో మరోసారి గ్రామీ అవార్డ్స్‌లో క్వీన్‌ తన గ్రామీలో తన ఆధిపత్యం చూపించింది.  ఆ యేడాది I Am... Sasha Fierce , "Halo", "Single Ladies (Put a Ring on It)", "At Last" ఈ నాలుగు పాటలకు వివిధ విభాగాల్లో 6 గ్రామీ అవార్డులు దక్కించుకుంది.

2013లో Love on Topకు ఒకటి , 2015లో Beyonce, Drunk in Love" పాటలకు మూడూ గ్రామీలు ఆమె చేతులను ముద్దాడాయి.

2017లో Formation, 2019లో Everything is Love, 2020లో Homecoming అంటూ వచ్చి అవార్డులను ఎగరేసుకుపోయింది.

2021లో Black Parade, Savage, Brown Skin girl పాటలకు నాలుగు అవార్డులు గెలుచుకుంది.

ఈ ఏడాది Break My soul తో పాటు Plastic off the Sofa, Be Alive పాటలకు  3 అవార్డులు గెలుచుకుని అంతకుముందు జార్జ్‌ సోల్టి పేరు మీద ఉన్న 31 అవార్డుల రికార్డును బద్దలుకొట్టింది.

మరిన్ని వెబ్‌స్టోరీస్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండి