H3N2: దేశంలో కొత్త వైరస్ లక్షణాలు, వ్యాప్తి, జాగ్రత్తలపై.. ICMR కీలక సూచనలు
YouSay Short News App
వేసవి సమీపిస్తున్న వేళ.. దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు జలుబు, దగ్గు, వైరల్ జ్వరాల బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.
కరోనా మాదిరి లక్షణాలున్న ఈ వ్యాధికి ‘ఇన్‌ఫ్లూయెంజా-ఏ ఉప రకం హెచ్3ఎన్2’ కారణమని ICMR శాస్త్రవేత్తలు తెలిపారు
H1N1 వైరస్ రూపం మార్చుకుని H3N2గా ఉత్పరివర్తనం చెంది వేగంగా వ్యాపిస్తోందని వెల్లడించారు
ఈక్రమంలో ఇన్‌ఫ్లూయెంజా వైరస్ H3N2 వ్యాధి లక్షణాలు, వ్యాప్తి, నివారణ చర్యలు తెలుసుకుందాం
H3N2 అనేది ఇన్‌ఫ్లూయెంజా-ఏ వైరస్ రెండు ప్రోటీన్ జాతుల కలయిక.ఇది శ్వాసకోశ సంబంధిత వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ జాతులు H1 నుంచి H18 వరకు ఉన్నాయి.
H3N2 వైరస్?
జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తుమ్ములు, తలనొప్పి, చలి, గొంతులో గరగర, ముక్కు కారడం, అలసట, అతిసారం, వాంతులు, ఊపిరి ఆడకపోవడం వంటివి ఈ వైరస్ లక్షణాలు.
H3N2 లక్షణాలు..
కరోనా మాదిరిగానే ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇంట్లో ఒకరికి వస్తే మిగతావారికీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
జాగ్రత్తలు ?
వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి వారి సూచన మేరకు మందులు వేసుకోవాలి
కేవలం జలుబు, దగ్గు ఉంటే రెండు మూడు రోజులు వేచి చూడొచ్చు. కానీ, జ్వరం, విరేచనాలు ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది
వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉన్న రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలి, మాస్క్ ధరించాలి
చేతుల్ని ఎప్పటికప్పుడూ సబ్బుతో కడుక్కోవాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇతరులకు వైరస్ సోకకుండా ఉంటుంది.
తుమ్ములు, దగ్గు వచ్చినప్పుడు నోటిని, ముక్కుని మాస్క్‌తో కప్పుకోవాలి. వ్యాధిసోకిన వారు తిరగకుండా తగినంత విశ్రాంతి తీసుకోవాలి. గోరు వెచ్చని నీటిని సేవించాలి
H1N1వైరస్ H3N2 వైరస్ ఉత్పరివర్తనం చెందింది. అంటే మందులకు లొంగని సామర్థ్యాన్ని సంతరించుకుంది.
యాంటిబయోటిక్స్ వాడాలా?
ఈ వైరస్ కారణంగా వచ్చే దగ్గు కనీసం మూడు వారాలు ఉంటుంది. ఇలాంటి వైరస్‌లకు యాంటీబయాటిక్స్ సొంతంగా తీసుకోకూడదు. లక్షణాలు కనిపిస్తే వైద్యుల సాయం తీసుకోవాలి
దేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న హెచ్3ఎన్2 వైరస్ వ్యాప్తిపై వైద్యులకు ఐసీఎంఆర్ కీలక సూచనలు చేసింది
ICMR సూచనలు
రోగులకు యాంటీబయాటిక్స్ రాసేటప్పుడు సదరు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వల్ల వచ్చిందా?లేదా? అన్నది వైద్యులు నిర్ధారించుకోవాలని సూచించింది.
లక్షణాల ఆధారంగా చికిత్స ఇవ్వాలని పేర్కొంది. సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు వంటి వాటికి యాంటీబయాటిక్స్ అవసరం లేదని స్పష్టం చేసింది.
మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్ చూడండి. YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.