మీ ప్రేయసితో కలిసి చూడదగ్గ  10 హారర్‌ సినిమాలు

Halloween 2022

అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగులో వచ్చిన హారర్‌ మూవీస్‌లో అద్భుతమైన సినిమాగా చెప్పొచ్చు. మీ ప్రేయసి చేతిలో చెయ్యేసుకుని ఈ సినిమా చూడండి.

అరుంధతి (2009) - MX Player

తెలుగు, తమిళంలో హారర్‌ జానర్లో కాంచన సిరీస్ సాధించిన విజయం మరే ఫిల్మ్‌ ఫ్రాంచైజీకి సాధ్యం కాలేదు. రాఘవ లారెన్స్‌ దర్శకత్వంలో దాదాపుగా ఒకే తరహా కథలతో వచ్చినా హారర్‌కు కామెడీని జోడించి ప్రేక్షకులను కట్టిపడేయడంలో విజయవంతమయ్యాడు.

‘కాంచన’ సిరీస్‌ - Hotstar

తెలుగులో హారర్‌ కామెడీ జానర్‌లో వచ్చి సూపర్‌ హిట్‌ కొట్టిన సినిమా ప్రేమకథా చిత్రం. విడుదలైనపుడు తొలివారం పెద్దగా కలెక్షన్లు లేకపోయినా రెండో వారంలో నుంచి బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది.

ప్రేమ కథా చిత్రం - Hotstar

తెలుగులో మరో హారర్‌ కామెడీ ఫ్రాంచైజీ ‘ రాజుగారి గది’. ఇప్పటికి మూడు సినిమాలు వచ్చాయి గానీ తొలుత వచ్చిన  సినిమానే అందులో ది బెస్ట్‌ అని చెప్పొచ్చు. హాలోవీన్‌ చలిగాలుల్లో చల్లగా దుప్పటి కప్పుకుని ఈ సినిమా చూసేయండి.

రాజుగారి గది సిరీస్‌  - Hotstar

తాప్సీ, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిశోర్‌, షకలక శంకర్‌, తాగుబోతు రమేశ్‌ ఇలా సూపర్‌ కాస్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా భయపెట్టడమే గాక కడుపుబ్బా నవ్వించే సినిమా. ఈ సినిమాకు తాప్సీ రెమ్యూనరేషన్‌ కూడా తీసుకోలేదని టాక్‌

ఆనందో బ్రహ్మ- Zee5

పగ నేపథ్యంలో సాగే ఈ హారర్ సినిమా ఫన్నీగా ఉన్నా తనకంటూ కొన్ని హారర్‌ మూమెంట్స్‌ను కలిగిఉంటుంది

గీతాంజలి - Zee5

దర్శకుడు రవిబాబు తీసిన అద్భుతమైన చిత్రాల్లో అవును ఒకటి. అప్పటిదాకా వచ్చిన హారర్‌ సినిమాలకు చాలా భిన్నంగా ఉండే ఈ సినిమా మీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది.

అవును- Hotstar

తెలుగులో హారర్‌ సినిమాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా మిమ్మల్ని కుర్చీలోంచి కదలనివ్వదు. అద్భుతమైన కథనం, స్క్రీన్‌ ప్లే అసలైన ఆర్జీవీని మీకు పరిచయం చేస్తాయి.

దెయ్యం - Prime Video

మరో ఆర్జీవీ అద్భుతం. సూపర్‌ స్టోరీ, అంతే అద్భుతంగా నటీ, నటుల పెర్ఫార్మెన్స్‌ మిమ్మల్ని తప్పకుండా ఆకట్టుకుంటాయి.

మర్రి చెట్టు - YouTube

భిన్నమైన కథ, కథనం, కెమెరా పనితీరు, సినిమాటోగ్రఫీ, డార్క్‌ మ్యూజిక్‌తో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న దర్శకుడు మిస్కిన్‌. ఆయన తెరకెక్కించిన ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని భయపెట్టి మీ మనసు దోచుకుంటుంది

పిశాచి- Hotstar