భారతీయ సినీ కళామాతల్లి ముద్దుబిడ్డ కమల్ హాసన్. తన నటనతో నవరసాలను పలకించగలడు.
నటుడిగానే కాకుండా ఇతర రంగాల్లోనూ బహుముఖ ప్రజ్ఞ పాటవం కలవాడు.
శాస్త్రీయ నృత్యం భరత నాట్యం, కూచిపూడి వంటి కళల్లో ఆరితేరాడు.సంగీతంలోనూ దిట్ట. అనేక చిత్రాల్లో స్వయంగా పాటలు పాడాడు.
అంతేకాదు బహుభాష కోవిదుడు. హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు.
ఇంతటి ప్రతిభావంతుడైన కమల్ NOV 7 న 68 వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నాడు.
ఆయన నటన పరంగా నవరసాలు ఒలికించిన చిత్రాలేవో ఓసారి తరచి చూద్దాం
‘మరో చరిత్ర’ భారతీయ సినిమాల్లో ఒక ఎవర్‌గ్రీన్ చిత్రంగా నిలిచిపోయింది. కమల్ ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఒక తమిళ అబ్బాయి, తెలుగమ్మాయి శృంగార ప్రేమ కావ్యమే ఈ చిత్రం.
ప్రేమ- మరో చరిత్ర (1978)
బ్రహ్మచారి చిత్రంలో కమల్ హాసన్ తన హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. ఈ సినిమాలో ప్రతీ ప్రేమ్‌లో కమల్ హాస్యం ఒలకబోశాడు. తన హాస్య చతురత ప్రదర్శించి చిత్రంలో హాస్యం పండించాడు.
హాస్యం- బ్రహ్మచారి (2002)
‘సత్య’ చిత్రంలో కమల్ హాసన్ ఒక నిరుద్యోగి పాత్రలో జీవించాడు. అన్యాయాలను, అక్రమాలను సహించని యువకుడిగా ఈ చిత్రంలో నటించి ఆకట్టుకున్నాడు. ఎంతో కసి, కోపం ఉన్నవాడిగా కనిపించాడు.
రౌద్రం- సత్య (1988)
కమల్ తన స్వీయ దర్శకత్వంలో ‘సత్యమే శివం’ చిత్రం రూపొందించారు. ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా చూసిన వారు కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండలేరు. ఈ సినిమాలో అన్నీ పొగొట్టుకుని, విషాదం మాటున సంతోషం పంచే వ్యక్తిగా కమల్ నటించాడు.
కరుణ- సత్యమే శివం (2003)
కమల్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, స్టోరీ సమకూర్చారు. కమల్ హాసన్ ఈ చిత్రంలో అమాయకపు తండ్రి పాత్ర పోషించి, ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పించారు. పిల్లలకు దూరమై, దుఖ పడుతున్న తండ్రిగా కమల్ అధ్భుతంగా నటించాడు. ప్రతీ ఫ్రేమ్‌లో కమల్ తన నటనా చాతుర్యం ప్రదర్శంచారు.
వీరత్వం- మహానది (1994)
తెనాలి చిత్రంలో కమల్ భయస్తుడిగా నటించాడు. వివిధ ఫోబియాలతో భయపడుతున్న వ్యక్తిగా చిత్రంలో జీవించాడు. ఒక పిరికి వ్యక్తి ఎలా ఉంటాడో.. అచ్చు అలాగే నటించి మెప్పించాడు. అందరూ చూడదగ్గ సినిమా ఇది.
భయానకం- తెనాలి (2000)
ఈ చిత్రంలో ఏజెంట్ విక్రమ్‌గా కమల్ హాసన్ తన ధైర్యసాహసాలతో హీరోయిజాన్ని చూపాడు. 40 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ విక్రమ్ పేరుతో సినిమాలో నటించాడు. ఈ చిత్రంలో జేమ్స్ బాండ్ తరహాలో తన క్యారక్టరైజేషన్ ఉంటుంది.
సాహసం- విక్రమ్ (1986), (2022)
భారతీయుడు చిత్రంలో కమల్ హాసన్ నటన వేరే లెవెల్. ఈ చిత్రంలో జరిగే హత్యలు అన్నీ కమల్ చేశాడని పోలీసులు తెలుసుకుని అరెస్ట్ చేస్తారు. అప్పుడు కమల్ ఇచ్చే హావభావాలు అద్భుతం. ఇలాంటి నటన కేవలం కమల్ హాసన్‌కు మాత్రమే సాధ్యం.
అద్భుతం- భారతీయుడు (1996)
సాగర సంగమం చిత్రంలో కమల్ హాసన్ నట విశ్వరూపమే ప్రదర్శించారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో అతను ప్రదర్శించిన శాంతి రసం ఎంతో అద్భుతం. ఎంతో శక్తివంతమైన క్లైమాక్స్ సన్నివేశాల్లో ఇది ఒకటి