హ్యాపీ బర్త్‌డే రానా దగ్గుబాటి ఈ భల్లాలదేవుడు నటుడు మాత్రమే కాదు

YouSay Short News App

లీడర్‌, కృష్ణం వందే జగద్గురుమ్‌, బాహుబలి సినిమాలతో నటుడిగా రానా సత్తా మనకు తెలుసు. కానీ చిన్నప్పటి నుంచి సినిమాల్లోనే పెరిగిన రానా నటనకు మాత్రమే పరిమితం కాదు

ప్రొడ్యూసర్‌, రచయిత, వీఎఫ్‌ఎక్స్, డబ్బింగ్‌, సింగర్, ప్రెసెంటర్‌ ఇలా సినిమాలో ఉన్న ఎన్నో రంగాల్లో రానా ప్రవీణుడు.19 సినిమాలకు వేర్వేరు బాధ్యతలతో అద్భుతంగా రాణించాడు

నటుడిగా మనకు 2010లో పరిచయమైనా, 2004లోనే ‘బొమ్మలాట’ సినిమా ప్రొడ్యూస్‌ చేశాడు. ఈ సినిమాకు ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు కూడా వచ్చింది.

నిర్మాతగా మొదలు

2004లో వచ్చిన రానా బాబాయ్‌ వెంకీ మామ  ‘లక్ష్మి’ సినిమాకు డిజిటల్ పోస్ట్‌ సూపర్‌వైజర్‌గా రానా పనిచేశాడు

డిజిటల్ పోస్ట్ సూపర్‌వైజర్‌

2006లో వచ్చిన మహేశ్‌ ‘సైనికుడు’తో పాటు తిరుపతి అనే సినిమాలకు విజవల్‌ ఎఫెక్ట్‌ కో-ఆర్డినేటర్‌గా చేశాడు. సైనికుడు సినిమాకు స్పెషల్‌ ఎఫెక్ట్స్ విభాగంలో నంది అవార్డు కూడా వచ్చింది

విజువల్‌ ఎఫెక్ట్స్ కో - ఆర్డినేటర్‌

విన్నర్‌, రాజరథం(తెలుగు), సుబ్రహ్మణ్యపురం, పొన్నియన్‌ సెల్వన్‌-1( తెలుగు ) సినిమాలకు కథకుడిగా తన సాయం అందించాడు

కథకుడు

మంచి సినిమాలను ముందుండి ప్రోత్సహించే రానా..℅ కంచరపాలెం, కృష్ణ అండ్‌ హిజ్ లీల, 777 చార్లీ, గార్గి వంటి మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించాడు

సమర్పణ

తన గంభీరమైన కంఠాన్ని చాలా సినిమాలకు అరువిచ్చాడు. అవెంజర్స్‌లో థానోస్‌కు డబ్బింగ్‌ చెప్పింది రానాయే. ఎండ్‌ గేమ్‌, ఇన్ఫినిటీ వార్‌ రెండింట్లోనూ థానోస్‌కు రానా వాయిస్‌ ఇచ్చాడు

డబ్బింగ్ ఆర్టిస్ట్

RRR విలన్‌ రే స్టీవెన్సన్‌తో పాటు ‘ఇన్‌ఫెర్నో’ హాలీవుడ్ మూవీ తెలుగు వెర్షన్‌కు కూడా రానా డబ్బింగ్‌ చెప్పాడు

విశాల్‌ ‘యాక్షన్‌’ సినిమా తెలుగు డబ్బింగ్‌లో ‘ లైట్స్‌ కెమెరా యాక్షన్‌’ ర్యాప్‌ చేసి ప్లేబ్యాక్‌ సింగర్‌గానూ నిరూపించుకున్నాడు

ప్లేబ్యాక్‌ సింగర్‌

శేఖర్‌ కమ్ముల ‘లవ్‌ స్టోరీ’ ఎటువంటి క్రెడిట్స్‌ తీసుకోకుండానే వాయిస్‌ ఓవర్‌ చెప్పాడు. అంతే రానా నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాడు. సినిమాయే తన ప్రపంచమని సురేశ్‌ బాబు చెబుతుంటారు.

వాయిస్ ఓవర్‌