YouSay Short News App
హ్యాపీ బర్త్‌డే రెజీనా కసాండ్రా
రెజీ గురించి ఆసక్తికర విషయాలు
1990 డిసెంబరు 13న రెజీనా కసాండ్రా
చెన్నైలో జన్మించింది
తొమ్మిదేళ్లకే ఓ కిడ్స్ ఛానల్‌లో రెజీనా
యాంకర్‌గా చేసింది
2005లో ‘కందనాల్ ముదై’ తమిళ్ సినిమాతో తెరంగేట్రం చేసింది.
చెన్నైలోని క్రిస్టియన్ ఉమెన్స్ కాలేజీలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.
2012లో ‘శివ మనసులో శృతి’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
మారుతి ‘కొత్త జంట’ సినిమాలో నటించి
మంచి మార్కులు పొందింది.
‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాతో రెజీనా
బాక్సాఫీస్ హిట్ అందుకుంది.
ప్రశాంత్ వర్మ ‘అ!’, అడివి శేష్ ‘ఎవరు’,
జ్యో అచ్చుతానంద సినిమాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
‘శాకిని ఢాకిని’లో నాయికా ప్రధాన పాత్రలో
నటించి మరోసారి ఆకట్టుకుంది.
చిరంజీవితో నటించాలనే కోరికతో ‘ఆచార్య’ సినిమాలో ఐటెం సాంగ్ చేసిందీ బ్యూటీ.
అ! సినిమాలో తన జుట్టును షేవ్
చేసుకోవడంపై ఇప్పటికీ గర్వంగా ఫీలవుతానని
ఈ నటి చెబుతుంటుంది.
రాకెట్ బాయ్స్, షూర్ వీర్, ఫింగర్ టిప్ వంటి సిరీసుల్లోనూ ఈ భామ నటించింది.
ఏ విషయాన్నైనా ముక్కుసూటిగానేే వెల్లడించే
తత్వం ఉన్న అమ్మాయి.
అబ్బాయిలు, మ్యాగీ రెండు నిమిషాల్లో అయిపోతారని కామెంట్ చేసి ఆశ్చర్యపరిచింది.
‘క్రిమినల్ సైకాలజీ’లో మాస్టర్స్ చేయాలనే లక్ష్యం ఉండేదని తొలినాళ్లలో చెప్పేది
కోపమొచ్చినా, బాధేసినా, సంతోషమేసినా.. ఏదైనా తినడం రెజీనాకు అలవాటట.
సినిమాల విషయంలో తనకు తానే స్ఫూర్తి అని, ఎవరూ తనని ప్రభావితం చేయబోరని చెబుతుంటుంది.