సమంతకు మయోసైటిస్‌ తగ్గిందా ? అందుకే  యాక్టివ్‌గా మారిందా?

YouSay Short News App

తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్‌ హీరోయిన్‌ సమంత. ఇటీవల మయోసైటిస్‌ వ్యాధి బారిన పడి ఇబ్బంది పడుతోంది. చికిత్స పొందుతున్న ఆమె కాస్త కోలుకున్నట్లు కనిపిస్తుంది.

అప్పుడెప్పుడో యశోద సినిమాకు ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె మళ్లీ ఎక్కడా కనిపించలేదు. న్యూఇయర్‌ కూడా ఎంజాయ్ చేయలేదు. దీంతో ఆమెకు వ్యాధి తగ్గలేదని అనుకున్నారు.

ఒక్కసారిగా శాకుంతలం ట్రైలర్‌ లాంఛ్‌లో సామ్ సందడి చేసింది. ఫ్యాన్స్‌ను కలవాలనే గట్టిగా అనుకొని వచ్చినట్లు చెప్పింది. ఇన్‌స్టాలోనూ యాక్టివ్‌గా మారటంతో సమంత కాస్త కోలుకుందని భావిస్తున్నారు.

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సామ్ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సినిమాలు అడపాదడపా చేసినా పెద్దగా ఆడలేదు. సోషల్‌ మీడియాలో చాలా ట్రోల్స్‌ ఎదుర్కొంది.

ఒక్కరోజులో

యశోద సినిమా సమయంలో తనకు మయోసైటిస్‌ అనే వ్యాధి సోకినట్లు సామ్‌ తెలిపింది. చికిత్స తీసుకుంటూనే డబ్బింగ్‌ పూర్తి చేసింది.

మయోసైటిస్‌

ఒక్కసారిగా వ్యాధి సోకటంతో ఇంటికే పరిమితం అయ్యింది సామ్. మీడియా ముందుకు రాలేదు. ప్రమోషన్లలోనూ పాల్గొనలేదు. యశోద సినిమా కోసం కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చింది.

మాయమైన సామ్

మయోసైటిస్‌ సోకిన తర్వాత సమంత లుక్స్‌ చాలా మారిపోయాయి. ఆమె అందం తగ్గిపోయిందని చాలామంది అన్నారు.

జెస్సీకి ఏమైంది ?

ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఫొటోలు చూసి ఏమైంది సామ్‌ నీకు అంటూ ఫ్యాన్స్‌ కామెంట్లు పెట్టారు.

ఇటీవల యాక్టివ్‌గా మారిన సమంత ట్విటర్‌లో అభిమానుల ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది. నేను ఓ అమ్మాయి కోసం ప్రార్థిస్తున్నాను.

ఆమెకు నువ్వు కావాలి

ఆమె ఎవరో కాదు నువ్వే అని ఒకరు పోస్ట్‌ చేయగా… ఆమెకు నువ్వు కావాలి అంటూ బదులిచ్చింది.

సమంత చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చింది. శాకుంతలం ట్రైలర్‌ లాంచ్‌లో సందడి చేసింది.

మీడియా ముందుకు

సమంత గురించి గుణశేఖర్‌ మాట్లాడుతుండగా ఆమె కన్నీరు పెట్టుకుంది. మిమ్మల్ని చూడాలని గట్టిగా ఫిక్స్‌ అయ్యి వచ్చాను అంటూ ఫ్యాన్స్‌కు చెప్పింది. ప్రీ రిలీజ్‌కి కూడా వస్తుందంట.

ఏడ్చేసిన సామ్

శాకుంతలం ట్రైలర్ రిలీజ్ తర్వాత చీరకట్టులో దిగిన ఫొటోలను సామ్ పోస్ట్ చేసింది. విశ్వాసంతో మెుదటి అడుగు వేయండి అంటూ  ఓ క్యాప్షన్ ఇచ్చింది.

వ్యాధి తగ్గిందా?

ఒక్కసారిగా మళ్లీ సమంత కోలాహలం పెరగటంతో ఆమెకు వ్యాధి తగ్గిందని భావిస్తున్నారు.