ఓ సినిమా బాగుందని టాక్ వచ్చాక కలెక్షన్లు పెరగడం కామన్ కానీ, సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఉంటే తప్ప తొలిరోజు కలెక్షన్లు రావడం కష్టం. మరి ఇండియన్ సినిమాలో అలా తొలిరోజే బ్లాక్‌బస్టర్ వసూళ్లు సాధించిన సినిమాలేంటో చూద్దాం
తొలిరోజు వసూళ్లలో అదరగొట్టిన టాప్-5 సినిమాల్లో తొలి రెండు టాలివుడ్ నుంచే..! మరి రాజమౌళి మన దగ్గరుండగా అది ఇంకెవరికి సాధ్యమవుతుంది చెప్పండి. సినిమా టేకింగ్‌లో అయినా ప్రమోషన్‌లో అయిన రాజమౌళిని మించినోడు లేడనే చెప్పాలి.
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మార్మోగుతున్న పేరు RRR. ‘నాటు నాటు’ పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం. ఆస్కార్‌కు కూడా నామినేట్ కావడంతో ఇండియన్ సినిమాలోనే మర్చిపోలేని సినిమాగా RRR నిలిచింది.
1.RRR
రాజమౌళి తెరకెక్కించిన ఈ కళాఖండంలో రామ్‌చరణ్, ఎన్టీఆర్ నటనకు ప్రపంచమే ఫిదా అయింది.
విడుదల : 25/03/2022తొలిరోజు కలెక్షన్: ₹240 కోట్లు
RRR తొలిరోజు కలెక్షన్లు
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ఒక్క సస్పెన్స్‌తో రాజమౌళి ఇండియానే షేక్ చేశాడు. అది చూసేందుకే ఈ సినిమాకు జనం ఎగబడ్డారు. ఈ సినిమాతో ప్రభాస్ మార్కెట్ ఊహించని స్థాయికి వెళ్లింది.
2.బాహుబలి - 2
విడుదల : 28/04/2017తొలిరోజు కలెక్షన్: ₹217 కోట్లు
బాహుబలి - 2 తొలిరోజు కలెక్షన్లు
బాహుబలి మాదిరిగానే కేజీఎఫ్ కూడా మొదటి సినిమాతో క్రియేట్ చేసిన మ్యాజిక్ రెండో పార్ట్‌కు తొలిరోజు వసూళ్లు రాబట్టింది. ఈ సినిమాతో హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ భారీ సక్సెస్ సాధించారు.
3.KGF చాప్టర్ - 2
విడుదల :14/04/2022తొలిరోజు కలెక్షన్: ₹ 134.5 కోట్లు
KGF - 2 తొలిరోజు కలెక్షన్లు
బాహుబలితో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా భారీ అంచనాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. సుజీత్ దర్శకత్వంలో భారీ యాక్షన్ సన్నివేశాలతో వచ్చిన ట్రైలర్లు కూడా సినిమాపై ఆసక్తిని పెంచాయి.
4.సాహో
విడుదల : 30/08/2019తొలిరోజు కలెక్షన్: ₹ 130 కోట్లు
సాహో తొలిరోజు కలెక్షన్లు
షారుఖ్ ఖాన్ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ తెరపైకి వచ్చిన ‘పఠాన్’ బాలివుడ్ చరిత్రలోనే అత్యధిక తొలిరోజు వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. బాయ్‌కాట్ పేరిట సినిమాపై తీవ్ర వ్యతిరేక ప్రచారం జరిగినా ఓపెనింగ్ వసూళ్లు
మాత్రం గట్టిగానే వచ్చాయి.
5. పఠాన్
విడుదల : 25 /01/2023తొలిరోజు కలెక్షన్: ₹ 100 -110 కోట్లు
పఠాన్ తొలిరోజు కలెక్షన్లు
డే1 కలెక్షన్లలో 6 నుంచి 10 స్థానాల్లో ఉన్న సినిమాల్లో కొలివుడ్ అగ్రగామిగా ఉంది.
మొత్తంగా టాప్-5లో 3 సినిమాలతో టాలివుడ్ తొలిరోజు కలెక్షన్లలో తిరుగులేనిదిగా ఉంది. టాప్-10 చూస్తే 4 టాలివుడ్, 4 కొలివుడ్,
1 శాండల్‌వుడ్, 1 బాలివుడ్ సినిమా ఉన్నాయి.