HBD Disha Patani: పెంపుడు జంతువులంటే దిశాకు ప్రాణం.. వీటి గురించి మీకు తెలుసా?

YouSay Short News App

‘లోఫర్‌’ సినిమా ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది దిశా పటాని. ఈ హాట్ బ్యూటీ నేటితో (జూన్‌ 16) 31ఏళ్లు పూర్తి చేసుకుంది.

సోషల్ మీడియాల్లో ఈ అమ్మడికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రాంలో ఏకంగా 5.8 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ అప్పుడప్పుడు తన పెంపుడు జంతువుల ఫొటోలను కూడా పంచుకుంటుంది.

దిశా పటాని పెట్ లవర్. తన వద్ద బెల్లా, గోకు, చి చి అనే మూడు శునకాలు ఉన్నాయి. జాస్మిన్, కీటీ అనే రెండు పిల్లులను కూడా పెంచుకుంటుంది.

రీసెంట్‌గా దిశా ఫ్యామిలీలోకి చి చి వచ్చింది. ఈ శునకంతో రొమాన్స్ చేస్తూ తెగ సంబరపడుతుంది.

షూటింగుల్లోకి వెళ్లినప్పుడు దిశా పటాని తన పెంపుడు శునకాలను చాలా మిస్ అవుతుంటుంది.

బెల్లా శునకం ఇంగ్లీష్ కాకర్ స్పేనియల్ జాతికి చెందింది. ఇవి స్పోర్టింగ్ డాగ్ కేటగిరీకి చెందుతాయి. చెవులు పెద్దగా ఉంటాయి.

చి చి శునకం అమెరికన్ పిట్‌బుల్ బ్రీడ్‌‌కి చెందినది. సాధారణంగా వీటికి సహనం తక్కువ. కానీ, దూకుడుగా ఉండవు.

గోకు శునకంతోనూ దిశా సన్నిహితంగా ఉంటుంది.  డాబర్‌మాన్ బ్రీడ్ ఇది. నిర్భయంగా, తెలివిగా,  నిజాయితీగా ఉంటాయి.

పాడి పశువులన్నా, జంతువులన్నా దిశాకు ఎంతో ప్రాణం. వీలు చిక్కినప్పుడు వెళ్లి వాటిని ముద్దాడుతుంది.

జాస్మిన్, కీటీలతో సరదాగా టైం గడుపుతుంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran