చిరుతలాంటి వేగం. ప్రత్యర్థులు ఎంతటివారైనా భయపడని మనస్తత్వం. క్షణాల్లో ఆటను మలుపు తిప్పడం అతడి నైజం.
మైదానంలో అడుగుపెట్టాడంటే అవతలి జట్టు బలవంతులైనా సరే కొంత జంకాల్సిందే. అదేవరో కాదు ఫ్రాన్స్ ఆటగాడు ఎంబాపే.
ఇప్పుడు ప్రపంచాన్నే ఊపేస్తున్న ఈ యువ కెరటం పుట్టి ఈరోజుకి 24 ఏళ్లే అయ్యింది. డిసెంబర్ 20 1998లో జన్మించి చిన్న వయసులోనే సాకర్ ప్రపంచాన్ని ఏలుతున్నాడు.
మరి ఇలాంటి సమయంలో ఎంబాపే గురించి తెలుసుకోకపోతే ఎలా?
పారిస్‌లోని బాండీ క్లబ్‌లో 2015 నుంచి ఆడటం ప్రారంభించిన ఎంబాపే వెనక్కి తిరిగి చూడలేదు. మెునాకో, పారిస్ సెయింట్ జైర్మెన్ క్లబ్‌లో ఆడి తనదైన ప్రదర్శనతో దూసుకెళ్లాడు ఈ యువ కెరటం.
ఆరంగేట్రం అదుర్స్
2018లో కేవలం 18 ఏళ్ల వయసులోనే ఫ్రాన్స్ తరఫున ఆరంగేట్రం చేసి అదరహో అనిపించాడు.
తల్లిదండ్రుల స్ఫూర్తి
తండ్రి విల్‌ఫ్రిడ్ ఎంబాపే స్వతాహాగా ఫుట్‌బాల్ ఆటగాడు. కొద్దిరోజులకు కోచ్‌గా మారాడు. ఎంబాపే తల్లి కూడా హ్యాండ్ బాల్ ప్లేయర్.
దీంతో అతడికి పూర్తి మద్దతు దొరికింది. తండ్రి వద్దే కోచింగ్ తీసుకొని అంచలంచెలుగా ఎదిగాడు.
ఎంబాపే ముగ్గురు ఫుట్‌బాల్ దిగ్గజాలను ఆరాధిస్తాడట. అందులో ఫ్రాన్స్ ఆటగాడు జినడిన్ జిడాన్, బ్రెజిల్ సూపర్ స్టార్ రోనాల్డోతో పాటు క్రిస్టియానో రొనాల్డినోను అభిమానిస్తాడు.
క్రీడాకారుల ఆదర్శం
ప్రపంచకప్ ఫైనల్‌లో గోల్ కొట్టిన రెండవ టీనేజర్‌గా ఎంబాపే రికార్డు సృష్టించాడు 2018 ఫిఫా మెగా ఈవెంట్‌లో బెస్ట్ యంగ్ ప్లేయర్ అవార్డు వరిచింది.
రికార్డులు
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో హ్యాట్రిక్ గోల్స్ సాధించిన ఆటగాడు ఎంబాపే. చిన్నవయసులోనే రెండో అత్యంత ఖరీదైన క్రీడాకారుడిగా నిలిచాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి.
మర్చిపోతారా?
ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్ 2022 ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఎంబాపే ఆటను ఎవరైనా మర్చిపోగలమా. అప్పటివరకు ఆధిక్యం కనబర్చిన అర్జెంటీనాకు ఎంబాపే తన మెరుపు వేగంతో చుక్కలు చూపించాడు.
కేవలం 90 సెకన్లలో 2 గోల్స్ చేసి జట్టును రేసులో ఉంచాడు. ఇది అతడి కెరీర్‌లోనే నిలిచిపోతుంది.
ఎంబాపేకు స్నీకర్స్ అంటే పిచ్చి ఇష్టమంట. అవి చాలా ఖరీదు కావటంతో వాళ్ల అమ్మని కొనివ్వాలని వేడుకునేవాడట.
స్నీకర్స్ పిచ్చి
ఈ ఒక్క విషయంలోనే ఆమె దగ్గర ఏడ్చేవాడినంటూ చెప్పాడు. తను ధరించిన మెుదటి స్నీకర్స్ నైకీ వాపర్స్.
నైకీ వెబ్ సైట్‌లో ఎంబాపే పేరుతో ఓ షూ కూడా ఉంది. ఫుట్‌వేర్‌లోని స్టార్స్ ఛాయిస్‌లో బొటిక్ డి ఎంబాపే పేరుతో షూ కొనవచ్చు.
ఎంబాపే పేరుతో స్నీకర్స్
ఎంబాపేలా స్టైలిష్‌గా మారాలంటే ప్యారిస్‌లో కొన్ని నైకీ షోరూంలే ఉన్నాయని చెబుతుంటారు.
స్టైల్‌లోనే కాదు ఫిట్‌నెస్ మెయింటేన్ చేయటంలోనూ ఎంబాపే ముందుంటాడు. అందుకే మైదానంలో మెరుపు వేగంతో అటాక్ చేయగలడు.
ఫిట్ నెస్, రన్నింగ్
ఇతను ఉస్సేన్ బోల్ట్‌కి సమానంగా కాకపోయినా అతడితో పోటీ పడగల సామర్థ్యం ఉంది. ఓ సారి రికార్డు బద్దలు కొట్టేందుకు ట్రై చేశాడు కూడా కాని కుదరలేదు.
ఎంబాపేకు సామాజిక మాధ్యమాల్లోనూ చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. దాదాపు 50 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.
ఫాలోవర్స్ ఎక్కువే
ఎంబాపేకు సామాజిక మాధ్యమాల్లోనూ చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. దాదాపు 50 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. ఇది ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యూయల్ మాక్రాన్ కన్నా ఎక్కువ.
ప్రస్తుతం దిగ్గజ ఆటగాళ్లు మెస్సీ, రొనాల్డోవంటి వారు దాదాపు ఆటకు వీడ్కోలు పలికే సమయం వచ్చింది. దీంతో ఎంబాపే సూపర్ స్టార్‌గా ఎదిగే అవకాశం పుష్కలంగా ఉంది.
ఫ్యూచర్ స్టార్
ఎంబాపే కూడా భవిష్యత్‌లో దిగ్గజ ప్లేయర్ల సరసన ఉంటానడంలో ఎలాంటి సందేహం లేదు.