HBD Tamannaah

15 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చిన మిల్కీబ్యూటీ

YouSay Short News App

తమన్నా భాటియా 1989 డిసెంబరు 21న జన్మించింది. మహారాష్ట్రలోని ముంబైలో మిల్కీ బ్యూటీ పుట్టింది.

తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించిన ఈ అమ్మడి కుటుంబమంతా వైద్యులే. సినిమా నేపథ్యం ఎవరికీ లేదు.

పదో తరగతి చదువుతున్నప్పుడే తమన్నా మేకప్ వేసుకుంది. హిందీలో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ సినిమాతో కెరీర్‌ని ఆరంభించింది.

15ఏళ్ల వయసులోనే తెలుగులోనూ తెరంగేట్రం చేసింది. 2005లో మంచు మనోజ్ ‘శ్రీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.

2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో విడుదలైన ‘హ్యాపీడేస్’ సినిమాతో తమన్నా హిట్ కొట్టింది.

2011, 2012 సంవత్సారాల్లో తమన్నా దాదాపుగా 10 సినిమాలు చేసింది. ఇందులో 100% లవ్, తమిళ్ సినిమా ‘సిరుతై’ విజయాలు సాధించాయి.

2013లో హిమ్మత్‌వాలా సినిమాతో మళ్లీ బాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా..తమన్నాకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది.

బాహుబలి సిరీస్ చిత్రాల్లో నటించి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుందీ మిల్కీ బ్యూటీ. ‘బాహుబలి: ద బిగినింగ్’ సినిమాలో అందంగా కనిపించి అలరించింది.

భోళాశంకర్, దటీజ్ మహాలక్ష్మి, ద క్వీన్ సినిమాల్లో ప్రస్తుతం తమన్నా నటిస్తోంది. ‘గుర్తుందా శీతాకాలం’లో నటించి ఈ అమ్మడు మోస్తరు విజయాన్ని అందుకుంది

హీరోయిన్‌గా అందచందాలు కురిపిస్తూనే.. నాయికా ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించేది. కొన్ని సినిమాల్లో తన డ్యాన్సింగ్ స్కిల్‌తో మెప్పించింది.

తన గురించి ఎవరేమన్నా పట్టించుకోకుండా ముందుకు సాగుతుంటుంది. బహుశా ఈ లక్షణమే తనను ఇక్కడిదాకా తీసుకొచ్చిందేమనని అంటుంటుంది.

17ఏళ్ల వయసులోనే బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ సమయంలో కెరీర్‌ మొదలుపెట్టాలా? ఇష్టమైన చదువును కొనసాగించాలా? అని బాగా ఆలోచించిందట.

17ఏళ్ల వయసులోనే బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ సమయంలో కెరీర్‌ మొదలుపెట్టాలా? ఇష్టమైన చదువును కొనసాగించాలా? అని బాగా ఆలోచించిందట.

నటనే కాకుండా ఈ అమ్మడు మోడలింగ్ కూడా చేసింది. వివిధ వాణిజ్య ప్రకటనల్లో మెరిసింది. ఐపీఎల్‌లో నృత్య ప్రదర్శన చేసింది.

‘వైట్ అండ్ గోల్డ్’ పేరుతో 2015లో సొంతంగా జువెల్లరీ రిటైల్ షోరూంని ప్రారంభించింది. ఇందులో తమన్నానే క్రియేటివ్ హెడ్.