మోర్బీ వంతెన చరిత్ర

© twitter

కుప్పకూలడానికి ప్రధాన కారణాలు

మోర్బీ నగరాన్ని 1922 వరకూ పరిపాలించిన సర్ వాఘ్జీ ఠాకోర్ 100 ఏళ్ల క్రితం ఈ వంతెనను కట్టించారు

మోర్బీ వంతెన ఎవరు నిర్మించారు?

© twitter

మోర్బీ తీగల వంతెన గుజరాత్‌లోని సుందరమైన పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. దీనిని 'మచ్చు' నది మీద కట్టారు.

© ANI

యూరప్ కళాత్మక శైలీలో అప్పటి ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మోర్బీ వంతెనను నిర్మించారు.

© ANI

ఈ వంతెన 1.25 మీటర్ల వెడల్పు, 233 మీటర్ల పొడవు ఉంటుంది. వంతెన సామర్థ్యం 100 మందిని మోయగలదు.

 © Twitter

వందేళ్లకు పైగా పూరతనమైన ఈ వంతెన శిథిలావస్థకు చేరడంతో 2022 మార్చిలో అధికారులు మూసివేశారు.

© ANI

మచ్చు నదిపై గతంలోనూ అతిపెద్ద ప్రమాదం

© ANI

మోర్బీ తీగల వంతెన కూలడానికి మానవ తప్పిదాలే ప్రధాన కారణమని తెలుస్తోంది.

మోర్బీ వంతెన ఎలా కుప్ప కూలింది?

 © Twitter

శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిని  15 ఏళ్ల పాటు మరమ్మతుల నిర్వహణ కోసం కొన్ని నెలల కిందట ఒరేవా గ్రూప్‌కు అప్పగించారు.

© ANI

6 నెలలపాటు ఒవెరా సంస్థ మరమ్మత్తులు చేసి అక్టోబర్ 26న ఓపెన్ చెసింది.

© ANI

కానీ  ఒవెరా సంస్థ తమకు తెలియకుండా సందర్శకులకు అనుమతిచ్చిందని మునిసిపల్ అధికారులు చెబుతున్నారు.

© Twitter

దీంతో వంతెన భద్రతను తాము తనిఖీ చేయలేకపోయామని తెలిపారు

© ANI

అక్టోబర్ 30న ఆదివారం సెలవు కావడంతో పెద్దసంఖ్యలో పర్యాటకులు వంతెనపైకి చేరారు.

© ANI

కేవలం 100 మందిని మోసే సామర్థ్యం ఉన్న బ్రిడ్జిపైకి దాదాపు 400మందికి పైగా అనుమతించారు. కొంతమంది ఆకతాయిలు వంతెనపై ఒక్కసారిగా ఊగటం మొదలుపెట్టారు. కుదుపులకు లోనైనా వంతెన కుప్పకూలి నదిలో పడిపోయింది.

© ANI

గుజరాత్- మోర్బీ వంతెన విషాదంలో మృతుల  సంఖ్య 141 దాటింది

 © Twitter

నదిలో మునిగి చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.చనిపోయిన వారిలో 47 మంది చిన్నారులే.

© ANI

కొంత మంది చిన్నారులు బ్రిడ్జి రెయిలింగ్ పట్టుకుని చాలా సేపు వెలాడారు. చెతులు నొప్పి పుట్టడంతో నదిలో పడి ప్రాణాలు కోల్పోయారు.

© ANI

ఇది భయంకరమైన మానవ విపత్తు. సాంకేతిక కారణాలతో 1979లో మచ్చు నదిపై నిర్మించిన డ్యామ్ విచ్ఛిన్నమైంది.

గతంలో మోర్బీని మించిన విషాదం

© ANI

డ్యామ్ తెగడంతో  5 వేల నుంచి 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది ఎకరాల్లో పంట నష్టం. వేలాదిగా పశువులు ప్రాణాలు కోల్పోయాయి.

© ANI

ఆ గుణపాఠాన్ని ఇంకా మన అధికారులు నేర్వకపోవడంతో మరో విషాదం మోర్బీ ముంగిట నిలిచింది. దేశంలో అతిపెద్ద విషాదాల్లో ఒకటిగా నిలిచింది.

© ANI