హిట్ ఫ్రాంఛైజీ నుంచి రెండో భాగం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థ్రిల్లర్ నేపథ్యంతో
శైలేశ్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన హిట్-2పై భారీ అంచనాలే ఉన్నాయి. మేజర్ హిట్ తర్వాత అడవి శేష్ నటించిన ఈ సినిమా ఎలా ఉంది.
థ్రిల్లర్స్‌తో మెప్పించే శేష్ మరోసారి ప్రేక్షకుల ఆదరణ పొందాడా ? అవేంజర్స్ తరహాలో యూనివర్స్ తీయాలనుకుంటున్న దర్శకుడి ఆలోచన ముందుకు సాగుతుందా? తెలుసుకోవాలంటే రివ్యూ చదివేయండి.
హిట్-1 తరహాలోనే అమ్మాయి హత్య నేపథ్యంతో సినిమా సాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో హత్యకు గురైన ఓ అమ్మాయి కేసును అతి బద్ధకంగా ఉండే పోలీస్ అధికారి దర్యాప్తు చేస్తుంటాడు.
కథ
దేశంలోనే సంచలనం సృష్టించే కేసును అడవి శేష్ ఎలా పరిష్కరించాడు? హీరోను కిల్లర్ ఎలా ముప్పు తిప్పలు పెట్టాడు ? నిందితుడిని ఎలా పట్టుకున్నారు? అనేది కథ.
విధుల పట్ల పెద్దగా ఆసక్తి చూపని పోలీస్ అధికారిగా అడవి శేష్, అతడితో రిలేషన్‌లో ఉండే మీనాక్షి చౌదరి మధ్య సన్నివేశాలతో సినిమా మెుదటిభాగం సాగుతుంది. ఒక్కసారిగా ఊహించని కేసు రావటం అది ఎలాగైనా పరిష్కరించాలని అడవి శేష్ ప్రయత్నాలతో ముందుకు కొనసాగుతుంది.
డీసెంట్ ఫస్టాఫ్
మెుదటి భాగంలో సాదాసీదాగా సినిమా సాగుతున్న తరుణంలో అదిరిపోయే ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాపై ఆసక్తి రేపుతోంది. సెకండాఫ్‌పై అంచనాలను పెంచుతుంది.
ఇంటర్వెల్ బ్యాంగ్
రెండో భాగంలో పూర్తిగా ప్రేక్షకులను దర్శకుడు కథలోకి తీసుకు వెళతాడు. కిల్లర్‌ను పట్టుకోవటం హీరోకు సవాలుగా మారుతుంది. ఇందుకోసం అడవి శేష్ వేసే ఎత్తుగడలు మనల్ని కుర్చీల్లోనే కట్టిపడేస్తాయి.
కుర్చీకి అతుక్కోవాల్సిందే
హిట్-2లో మెచ్చుకోదగిన అంశాలు స్క్రీన్ ప్లే, కథను మాత్రమే చెప్పాలనే దర్శకుడి ఆలోచన. కామెడీ, పాటలు అనే కమర్షియల్ హంగులకు పోకుండా.. కథ నుంచి పక్కదారి పట్టకుండా తెరకెక్కించాడు. మెుదటి నుంచి చివరిదాకా అద్భుతమైన స్క్రీన్ ప్లే అందించారు.
కథనం మాత్రమే
సినిమాకు వెన్నెముకగా నిలిచే వాటిలో ముఖ్యమైన సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌లో చిత్రబృందం విజయం సాధించింది. వీరి ప్రతిభతో మరో మెట్టు ఎక్కింది.
సాంకేతిక పనితీరు
థ్రిల్లర్ కథాంశానికి అవసరమైనది నేపథ్య సంగీతం. సన్నివేశాలకు తగినట్లుగా BGM ఇస్తే మరో లెవల్‌లో ఉంటుంది. కానీ, హిట్-2లో అది మిస్ అయ్యింది.
నేపథ్య సంగీతం
సినిమాకి ఎప్పుడైనా ప్రాణం పోసేది క్లైమాక్స్. అది బాగుంటేనే ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ, ఇక్కడ దర్శకుడు కాస్త తడబడ్డాడు. అదిరిపోయింది అనేలా కాకుండా మరీ అంత బాగాలేదు అని చెప్పకుండా యావరేజ్‌గా ముగిసిపోతుంది.
క్లైమాక్స్
చిత్ర యూనిట్ ముందుగానే చెప్పినట్లు మూడో పార్ట్ కోసం హీరోను పరిచయం చేశారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆ హీరోతో సినిమా ఉంటుందని ముందే తెలియటంతో హిట్-3 పై అంచనాలతోనే బయటకు వస్తారు.
హిట్-3
హీరోగా అడివి శేష్ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. మీనాక్షి చౌదరి పాత్రకు పెద్దగా స్కోప్ లేదు. రావు రమేశ్, కోమలి ప్రసాద్ పాత్రల మేరకు నటించారు.
ఎవరెలా చేశారు
హిట్-2 అక్కడక్కడ కాస్త తగ్గినప్పటికీ బాగుందనే చెప్పవచ్చు. థ్రిల్లర్ చిత్రం చూడాలనుకునే వారితో పాటు సినీ ప్రియులకు హిట్-2 సూపర్‌గా నచ్చుతుంది. ఇక రెగ్యులర్ కమర్షియల్ హంగులు కోరుకునే వారికి నిరాశ తప్పదు
సినిమా చూడొచ్చా లేదా
కథకథనంఅడవి శేష్ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ
ప్లస్
నేపథ్య సంగీతంక్లైమాక్స్
మైనస్
రేటింగ్ - 3/5
మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్ చూడండి. YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.