HOLI SPECIAL: హుషారెత్తించే టాప్ తెలుగు హోలీ పాటలు

YouSay Short News App

హోలీ వచ్చిందంటే రంగులతో పాటు ధూమ్‌ధామ్ డీజే ఉండాల్సిందే. ఆడుతూ పాడుతూనే  ఈ పండుగను ఎంజాయ్‌ చేయాలి.

చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఈ రంగుల కేళిని గడుపుతారు. మరీ ఈ వేడుక మరింత ఉత్సాహంగా గడిపేందుకు కొన్ని పాటలు మీకోసం.

రంగు రబ్బా రబ్బా

జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ సినిమాలో సూపర్ సాంగ్ ఇది. “రంగు రబ్బా రబ్బా అంటోంది రంగు భర్‌సే, గుండె శబ్బా శబ్బా అంటుంది రంగు భర్‌సే” పాట వేడుకలో ఉర్రూతలూగించాల్సిందే.

రంగేళి హోలీ

ప్రభాస్ హీరోగా వచ్చిన చక్రం సినిమాలో అదిరిపోయే హోలీ సాంగ్. “రంగేేలీ హోలీ హంగామా కేలీ. ఎక్కడ నువ్వుంటే అక్కడ జరగాలి” అనే పాట డీజేలో దుమ్ములేపుతుంది.

హోలీ హోలీ

పవన్ కల్యాణ్‌ పాట హోలీ పండగకు ఉంటే సందడే వేరు. ఖుషీ చిత్రంలో వచ్చిన “హోలీ హోలీ రంగ హోలీ చమ్మకేళిల హోలీ. గజ్జ గల్లుమన్నాదిరో గుండె ఝల్లుమన్నాదిరో” పాటతో మాస్‌ స్టెప్పులు వేయెుచ్చు.

రౌడీ బాయ్‌ సూపర్ సాంగ్

ప్రపంచ తెలుగు మహాసభల కోసం విజయ్ దేవరకొండ, మెహ్రీన్‌పై పాటను తీర్చిదిద్దారు.  వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ పాట మార్మోగించవచ్చు.

రంగు తీసి కొట్టు

నాగార్జున మాస్ చిత్రంలోని “కొట్టు కొట్టు రంగు తీసి కొట్టు రంగులోనే లైఫ్ ఉందిరా” అనే పాట పండుగ వేళ పెట్టుకొని ఎంజాయ్‌ చేసే విధంగా ఉంటుంది.

ఎకసెక

నాగ్‌, హరికృష్ణ నటించిన సీతారామ రాజు చిత్రంలోని ఎకసెక టాటా ఏలేలో అంటూ వచ్చే పాట ఇప్పటికీ ఫేమస్‌. ఇది కూడా హోలీ వేడుకల్లో నృత్యం చేయించే పాటనే.

మొట్టమొదటిసారి..

భలే భలే మగాడివోయ్ సినిమాలోనూ ‘మొట్ట మొదటి సారి… అని వచ్చే సాంగ్‌లో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నాని హోలి ఆడే విజువల్స్ సూపర్బ్‌గా ఉంటుంది

దోసపువ్వాసొంటి దోతులు..

సినిమా పాటలే కాకుండా కొన్ని ఫొక్ సాంగ్స్ కూడా హోలీ రోజు హుషారెత్తిస్తాయి. యూట్యూబ్‌లో దోసపువ్వాసొంటి దోతులు.. సాంగ్ హోలీ రోజు  ఫుల్ ట్రెండింగ్‌లో ఉంటుంది