HOLI: హోలీలో సెలబ్రెటీల సందడి… హీరోయిన్ల రచ్చ రచ్చ..

YouSay Short News App

హోలీ సంబరాల్లో సినీ తారలు, క్రికెటర్లు మునిగి తేలారు. రంగులు పూసుకొని ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.

మిల్కీ బ్యూటీ

నేపాల్ పర్యటనలో బిజీగా ఉన్న తమన్నా భాటియా హోలీని ఫుల్‌గా ఎంజాయ్ చేసింది. అందరికీ విషెస్ చెప్పింది మిల్కీ బ్యూటీ.

వైట్ కలర్ డ్రెస్‌లో సింపుల్‌గా కనిపించింది. తీరొక్క రంగులతో దిల్‌ఖుష్ అయింది

అనసూయ

కుటుంబ సభ్యులందరితో కలిసి హోలీ ఆడింది యాంకర్ అనసూయ. ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ ఉల్లాసంగా గడిపారు.

తన భర్తకు రంగులు పూస్తు ఆట పట్టించింది.  ఆత్మీయంగా కౌగిలించుకుని హోలీలో సందడి చేసింది.

పిల్లలతో హోలీ గన్స్ పట్టుకుని కలర్స్ పూసుకుంటూ ఎంజాయ్ చేసింది

రకుల్ ప్రీత్‌

స్నేహితులతో కలిసి ఫుల్‌ రచ్చ చేసింది రకుల్ ప్రీత్‌. పొట్టి దుస్తుల్లో ఆమె పెట్టిన ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి.

వైట్ కలర్ షార్ట్ నెక్కర్ ధరించి హోషారెత్తించింది

ప్రగ్యా జైస్వాల్‌

రకుల్‌తో కలిసి మస్తీ చేసిన బ్యాచ్‌లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఆమె కూడా ఉత్సాహంగా రంగుల పండుగలో పాల్గొన్నారు.

దివి

బిగ్‌ బాస్‌ ఫేం దివి హోలీ వేడుకల్లో దుమ్ము లేపింది. డాన్సులు చేస్తూ రంగులు చల్లుతూ రచ్చ చేసింది ఈ నటి.

హోలీ మొత్తం తనదే అన్నట్లూగా ఖుషి, ఖుషిగా ఎంజాయ్ చేస్తూ రంగులు పూసుకుంది

కేతిక శర్మ

హోలీలో రంగులు చల్లుకున్నా అందాల ఆరబోతలో తగ్గ లేదు కేతిక శర్మ. ఫుల్‌గా ఎంజాయ్ చేసి ఫొటోలకు ఫోజులిచ్చింది  ఈ భామ.

ఎద అందాలపై కలర్స్ పూసుకుని హోలీరోజు కూడా గ్లామర్ డోస్ పెంచి వారెవ్వా అనిపించింది

టీమిండియా

బోర్డర్ గవాస్కర్‌ ట్రోఫీలో బిజీగా ఉన్న హోలీ ఆడారు టీమిండియా క్రికెటర్లు. రోహిత్ శర్మ, సూర్య కుమార్ యాదవ్‌, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, కోహ్లీ రంగుల్లో తేలారు.

కోహ్లీతో రోహిత్‌

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీకి రంగులు పూశాడు. బస్సులో ఉన్న విరాట్‌పై రంగులు చల్లి విష్ చేసిన వీడియో వైరల్ అయ్యింది.

కోహ్లీ సూపర్ డాన్స్‌

ఉత్సవాల్లో భాగంగా డాన్స్ చేశాడు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ. శుభమన్‌ ఈ వీడియోను క్లిక్ మనిపించాడు.

ఆస్ట్రేలియా ప్రధాని

భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోని ఆల్బనీస్ కూడా రంగుల కేళి ఉత్సవంలో పాల్గొన్నారు.

గినా రైమోండో

అమెరికన్ రాజకీయ వేత్త గినా రైమోండో రంగుల ఉత్సవంలో ఉల్లాసంగా గడిపారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంచి వెలకమ్ ఇచ్చారని చెప్పారు గినా రైమోండో

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran