మార్కెట్‌లోకి సరికొత్త మెుబైల్‌లు అందుబాటులోకి రానున్నాయి. సెల్‌ఫోన్ ప్రియుల కోసం హానర్, ఒప్పో, వివో బ్రాండ్లు అప్డేటెడ్ మెుబైల్స్‌ను తీసుకురానున్నాయి.
హానర్ నుంచి మరో బడ్జెట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. 4 జీబీ RAM+128 జీబీ స్టోరేజీతో విడుదల చేస్తున్నారు. 6.5 ఇంచ్ డిస్‌ప్లే, 480 స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వస్తుంది. దీని ధర రూ. 20,000లు ఉండొచ్చు.
హానర్ 70 lite
ఒప్పో నుంచి X6, X6 pro ఫోన్లు మార్చి 21 న విడుదలవుతున్నాయి. ఈ సారి రౌండ్ కెమెరాను అందిస్తున్నారు. 12జీబీ+256 జీబీ, proలో 16జీబీ+256జీబీతో విడుదల చేస్తున్నారు.
ఒప్పో X6
బడ్జెట్ ఫోన్ ప్రియులకు శామ్‌సంగ్ గుడ్ న్యూస్ చెప్పింది. F14 పేరుతో మార్చి 24న మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నారు. 6జీబీ+128జీబీ స్టోరేజీతో రూ.17,999లకే 5జీ మెుబైల్ తీసుకువస్తున్నారు.
శామ్‌సంగ్ F14
వివో నుంచి ఫ్లిప్ ఫోన్ రాబోతుంది. శామ్‌సంగ్‌కు పోటీగా దీన్ని తీసుకువస్తున్నారు. 6.8 OLED డిస్‌ప్లే, 12జీబీ+128జీబీ స్టోరేజీతో వస్తున్న ఈ ఫోన్ ధర రూ.1,20,000 ఉంటుందని అంచనా.
వివో X ఫ్లిప్
ఇది మరో బడ్జెట్ ఫోన్. 16జీబీ RAM( 8జీబీ ఫిజికల్, 8జీబీ వర్చువల్ )+128జీబీ స్టోరేజీతో వస్తుంది. మార్చి 27న మార్కెట్‌లోకి లాంఛ్ చేయనున్నారు. దీన ధర కేవలం రూ.10,000
ఇన్‌ఫినిక్స్ హాట్ 30i
షావోమి సబ్ బ్రాండ్ పోకో నుంచి F5 5జీ మెుబైల్‌ను తీసుకువస్తున్నారు. 6.67 ఇంచ్ AMOLED డిస్‌ప్లే, క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 7+, 128జీబీ+256జీబీ వంటి ఫీచర్లతో ఏప్రిల్ 6న విడుదలవుతుంది.
పోకో F5
బడ్టెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో లభించే ఫోన్లలో IQoo ఒకటి. ఇందులో z7 5జీ మెుబైల్ 6జీబీ+128జీబీ స్టోరేజీతో వస్తుంది. దీని ధర రూ. 17,499. 8జీబీ+128జీబీ ధర రూ. 18,499లుగా ఉంది.
iQ00 Z7
నోకియా C99 పేరిట మార్కెట్‌లోకి ఫోన్ తీసుకువస్తుంది. ధర రూ. 36,000 కంటే ఎక్కువే. 6.7” డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 144 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 180W ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది.
నోకియా c99
మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్ చూడండి. YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.