అబ్బాయిల లవ్‌ ప్రపోజల్‌కు  " నో " చెప్పడమెలా?

YouSay Short News App

ప్రేమ…! మనిషి మనసులో ఇది సృష్టించినంత కల్లోలం. శరీరంలో ఇది చేసినంత హార్మోన్ల విధ్వంసం ఇంకేదీ చేయదేమో.

ఒకరి ప్రేమ కోసం ఆరాటపడేవారు కొందరు. ప్రేమ ఎలా చెప్పాలో తెలియక సతమతమయ్యేవారు కొందరు. తమకొచ్చిన ప్రేమ ప్రపోజల్‌ ఎలా తిరస్కరించాలో తెలియక తికమక పడేవారు మరికొందరు.

ప్రేమను తెలియజేయడం కష్టమే. తిరస్కారాన్ని ఎదుర్కొనే ధైర్యం కావాలి. కానీ ప్రేమను తిరస్కరించడం అంతకన్నా కష్టం. కాస్త తేడా కొట్టినా మనతో పాటు అవతలి వారి మనసు  కూడా చివుక్కుమంటుంది.

మరి ఎవరి మనసూ కష్టపడకుండా….  ఓ అబ్బాయికి నో చెప్పడమెలా? ఈ సలహాలు పాటించండి.

ఒక అబ్బాయి మీకు ప్రపోజ్ చేసినపుడు సూటిగా నో చెప్పండి. సాగదీయడం, నాన్చుడు ధోరణి ఇద్దరికీ మంచిది కాదు.సూటిగా చెప్పేందుకు ఇక్కడ కొన్ని వాఖ్యాలున్నాయి చూడండి.

సూటిగా సుత్తిలేకుండా

ఇదొక చాలా సులువైన, ఎవరికీ ఇబ్బందిలేని మాట. అవతలి వారి మనసును నొప్పించకుండా నో చెప్పేందుకు ఇదొక మార్గం.

నాకు ఇంటరెస్ట్‌ లేదు

మన దగ్గర లవ్ అంటే పెళ్లి ఆశలతోనే ముడిపడి ఉంటుంది. అది వర్కవుట్ కాదు అనుకున్నపుడు ముందే చెప్పేయండి. సంశయించొద్దు. వర్కవుట్ కాకపోవడానికి సరైన కారణం ఉంటే..ఇలా చెప్పొచ్చు.

వర్కవుట్‌ అవ్వదు

అలాగే కొన్ని మాటలు మీకు ‘నో’ అని చెప్పినంటే అనిపించినా అవతలి వారిలో ఆశలు పెంచవచ్చు. అలాంటి వాటికి దూరంగా ఉండండి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి చూద్దాం.

అప్పటికప్పుడు మీరు ఈ మాట చెప్పి తప్పించుకుని తర్వాత ఆలోచిద్దాంలే అనుకోవచ్చు. కానీ ఈ మాట అబ్బాయిలో సానుకూల ఆలోచన పెంచుతుంది. మీరు ఎస్ చెబుతారేమోనని ఎదురుచూస్తుంటాడు. ఒకవేళ ఈ మాట చెప్పినా వీలయినంత త్వరగా నో చెప్పండి

“నాకు టైం కావాలి”

ఇది కూడా టైం కావాలని చెప్పడం  లాంటిదే. ముఖం మీదే చెప్పడం మీకు ఇబ్బంది అయినప్పుడు ‘తర్వాత’ అని తప్పించుకోవడం మంచిదేగానీ…వీలయినంత త్వరగా తనకు వేరే మార్గాల్లో అయినా నో చెప్పేయండి.

తర్వాత చెబుతా

సూటిగా నో చెప్పండి చాలు. అంతే గానీ వారి మనోభావాలు దెబ్బతీయొద్దు. ‘నీకంత సీన్‌ లేదు’ ‘ ఏం చూసి లవ్‌ చెయ్యాలి నిన్ను’ ఇలా బాధపెట్టే మాటలు వద్దు. అవతలి వారు సున్నిత మనస్కులైనా, లేదా తీవ్రమైన వ్యక్తి అయినా మీరు బాధపడే పరిస్థితులు రావొచ్చు.

కఠినంగా వద్దు

ఒకవేళ అబ్బాయి మీకు ముందే తెలుసు, మంచివాడే కానీ అతడిపై ఆ ఉద్దేశం లేదనుకోండి. ఫ్రెండ్‌షిప్‌ ఆఫర్‌ చేయండి. క్లియర్‌గా నీపై నాకు ఆ ఉద్దేశం లేదు. స్నేహితులుగా ఉందామని చెప్పండి. ఒప్పుకునే అవకాశం ఎక్కువే.

దోస్తీ

కానీ ఒకసారి స్నేహానికి ఒప్పుకున్న తర్వాత మీ మనసు మార్చుకోవద్దు. అతడు ఎన్ని మెసేజ్‌లు చేసినా, అతడిపై మీకు జాలి వేసినా మాట మర్చొద్దు. మీకు నిజంగా అతడిపై ప్రేమ కలిగింది అనిపిస్తే గతంలో మీరెందుకు నో చెప్పారో ఆలోచించండి.

కొన్నిసార్లు మీ స్నేహితుడే మీకు ప్రపోజ్‌ చేయొచ్చు. అతడిని మీరు అలా ఎన్నడూ చూసిఉండకపోవచ్చు. అంతమాత్రాన నిర్దాక్షిణ్యంగా అతడి నంబర్‌ బ్లాక్‌ చేసి ఇక అతడిని ఓ శత్రువులా చూడొద్దు.

స్నేహితుడైతే

ఒక అబ్బాయి మీకు ప్రపోజ్ చేసినపుడు నచ్చలేదంటే నో చెప్పాలి అంతేగానీ భవిష్యత్‌లో ఆలోచిద్దాం అనే ధోరణి వద్దు. ఇది అతడికి ఆశలు పెంచడమే. మీకు భవిష్యత్‌లో కుదిరినా కుదరకపోయినా ఇప్పుడు yes చెప్పకూడదు అనుకుంటే no చెప్పడమే ఉత్తమం.

ఆశలు పెంచొద్దు

మీరు అప్పటికే వేరే అబ్బాయితే ప్రేమలో ఉంటే..సూటిగా అదే చెప్పండి. ఇలాంటప్పుడు పైన చెప్పిన ఏ జవాబు పనికిరాదు. ‘నేను ఇప్పటికే ప్రేమలో ఉన్నా’ అంటే ఏ అబ్బాయి అయినా అర్థం చేసుకుంటాడు.

ప్రేమలో ఉన్నా