‘రంజీ ట్రోఫీ’ ఎలా పుట్టింది?  ఆ పేరు ఎలా వచ్చింది?

YouSay Short News App

రంజీ ట్రోఫీ. బహుశా క్రికెట్‌కు సంబంధించిన ఈ టోర్నమెంట్‌ గురించి తెలిసినవారు చాలా తక్కువగా ఉంటారేమో. ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న ప్రతి ఒక్కరూ ఇక్కడ్నుంచి వచ్చిన వారే.

ఫామ్‌లో ఉన్నా, కోల్పోయినా ఆదరించే ట్రోఫీ ఇది. మరి ఇంత చరిత్ర కలిగిన రంజీ ట్రోఫీ ఎలా ప్రారంభమయ్యింది?  ఆ పేరు ఎందుకు పెట్టారు? అనే విషయాలు తెలుసుకోండి.

ఆంగ్లేయులు పరిచయం చేసిన క్రికెట్‌ను రాజులు కొనసాగించారు. నవనగర్‌ను పరిపాలిస్తున్న యువరాజు రంజిత్ సింగ్ ఇంగ్లాండ్ తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడారు. అతడి పేరు మీదుగానే ట్రోఫీకి నామకరణం చేశారు.

పేరు ఎలా?

1934లో టోర్నమెంట్ ప్రారంభమయ్యింది. పటియాలా మహారాజు భూపేందర్ సింగ్.. రంజిత్ సింగ్‌కి గుర్తుగా ట్రోఫీని అందించారు.

ప్రారంభం

1934 నవంబర్ 4న మద్రాస్, మైసూర్ మధ్య మెుదటి మ్యాచ్ జరిగింది. మద్రాస్‌లోని చేపాక్ మైదానంలో నిర్వహించారు.

మెుదటి మ్యాచ్

రాష్ట్ర జట్లు, క్రికెట్ అసోసియేషన్లు, ఫస్ట్ క్లాస్‌ అర్హత కలిగిన క్లబ్‌లు రంజీ ట్రోఫీ ఆడేందుకు అవకాశం కల్పిస్తారు. చాలా సంఘాలు ప్రాంతీయానికి చెందినవే ఉన్నాయి.

ఎవరెవరికి అవకాశం

ప్రస్తుతం 38 జట్లు రంజీ ట్రోఫీలో పాల్గొంటాయి. మెుదట్లో తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ జోన్లుగా విభజించి నిర్వహించారు. ప్రస్తుతం గ్రూపుల వారీగా పెడుతున్నారు.

ఎన్ని జట్లు

రంజీ ట్రోఫీని అత్యధిక సార్లు ముంబయి సొంతం చేసుకుంది. 1934 నుంచి ఇప్పటివరకు 41 సార్లు గెలిచింది.

గెలుపు గుర్రాలు

అత్యధిక స్కోరు 935 డిక్లేర్డ్, అత్యల్ప స్కోరు  21 రెండు హైదరాబాద్‌ జట్టు పేరుమీదే ఉన్నాయి.

రికార్డులు

అత్యధిక వ్యక్తిగత స్కోరు 443* బీబీ నింబాల్కర్ చేశాడు. వసీం జాఫర్ 155 ఇన్నింగ్స్‌లు ఆడాడు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.