ws_Snapinsta.app_1080_300756398_643602490438804_8347677472689409500_n

YouSay Short News App

పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ వచ్చినా..అది మాత్రం చేయను: ప్రియాంక జవాల్కర్

ws_Snapinsta.app_1080_320924258_918491112842771_7714099041537222719_n

పవన్ కళ్యాణ్‌ సరసన నటించే ఛాన్స్ వస్తే అస్సలు ఒప్పుకోనని కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది ప్రియాంక జవాల్కర్

ws_Snapinsta.app_1080_319067358_1868728166814306_6798645406048464044_n

తెలుగులో టాక్సీవాలా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి పవర్ స్టార్‌పై తన అభిప్రాయాన్ని పంచుకుని టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

ws_Snapinsta.app_1080_316141075_5493046370790560_5647673292524346741_n

తిమ్మరుసు, ఎస్ఆర్ కళ్యాణమండపం, గమనం సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది 30ఏళ్ల ప్రియాంక జవాల్కర్.

పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని ప్రియాంక జవాల్కర్. తమ్ముడు సినిమాను 20సార్లు చూసిందట. ఇక ఖుషి సినిమా ఎన్నిసార్లు చూసిందో లెక్కేలేదట.

సినిమాలో అవకాశం వస్తే చేయను అని చెబుతోంది. అభిమానిగా పవన్ కళ్యాణ్‌ని దూరం నుంచి చూస్తూనే జీవితం గడిపేస్తానని వెల్లడించింది.

మరాఠీ కుటుంబానికి చెందిన ప్రియాంక జవాల్కర్.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపూర్‌లో 1992లో నవంబర్ 12న  జన్మించింది.

బీఎస్సీ పూర్తి చేసి.. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫ్యాషన్ టెక్నాలజీలో డిప్లొమా చదివింది.

కొన్నాళ్లు అమెరికాలోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేసింది. వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో తన ఫొటోలు షేర్ చేస్తూ ఉండేది.

ప్రియాంక జవాల్కర్ మనసు ఒక్కసారిగా సినిమాల వైపు మళ్లింది. సంపత్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘కలవారమాయే’ సినిమాకు తొలిసారిగా మేకప్ వేసుకుంది.

పవన్‌కళ్యాణ్‌కి వీరాభిమాని అయినప్పటికీ పవర్‌స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న ఆసక్తి లేదని చెప్పడంతో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.

పవర్ స్టార్ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ చాలా సింపుల్‌గా ఉండటం తనకెంతో ఇష్టమని చెప్పిందీ భామ. 

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న బాలకృష్ణ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం.