చికెన్ తినాలంటే కోడిని చంపాల్సిన పనిలేదు. కృత్రిమ విధానంలో చికెన్ తయారీ

YouSay Short News App

సెల్‌ కల్చర్డ్‌  విధానం ద్వారా కృత్రిమంగా కోడి మాంసాన్ని అమెరికాలో పండిస్తున్నారు ఈ చికెన్ అచ్చం లైవ్ చికెన్‌ మాదిరి చూడటానికి మృదువుగా, రుచికి టేస్టీగా ఉంటుంది

ప్రజల ఆరోగ్యం విషయంలో అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటించే అమెరికన్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (USFDA) ఇటీవల ఈ చికెన్‌ను ధ్రువీకరించింది.

USFDA ధృవీకరణ

సెల్‌ కల్చర్డ్‌ చికెన్ తయారీ ప్రక్రియ ఒక కణంతో మొదలవుతుంది. కోడి నుంచి బయాప్సీ ద్వారా స్టెమ్ కణాలను వేరు చేసి సెల్‌ బ్యాంక్‌ రూపొందిస్తారు. వాటిని పెద్ద కంటైనర్‌లో పెంచి ఫలవంతం చేస్తారు.

ఎలా తయారు చేస్తారు?

పూర్తి స్థాయిలో చికెన్‌ తయారవడానికి కనీసం 14 రోజులు టైం పడుతుంది. ఆ తరువాత ప్రతి 18- 24 గంటలకు ఆ మాంసం రెట్టింపవుతుంది.

ఈ విధానం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తే మాంసాహారం కోసం జీవాలను వధించే ముప్పు తప్పుతుంది

జీవహింస లేదు

భవిష్యత్‌లో మేక, గొర్రె స్టెమ్‌ సెల్స్‌ నుంచి మటన్, పీత, బాతు వంటి స్టెమ్‌ సెల్స్‌ నుంచి ఆయా మాంసాలను కూడా ఉత్పత్తి చేయనున్నారు

కణం నుంచి ఉత్పత్తి అయ్యే కల్చర్డ్‌ చికెన్‌లో ఎలాంటి యాంటీబయాటిక్స్‌ మందుల్ని వాడరు. అందుకే  ఈ కోడి మాంసం తినడానికి ఎంతో సురక్షితమంటూ USFDA సర్టిఫై చేసింది

సురక్షితం

కల్చర్డ్ చికెన్‌లో తగినంత కొవ్వుతో పాటు కావాల్సిన స్థాయిలో ప్రొటీన్స్, విటమిన్ ఉన్నాయని FDA గుర్తించింది

ఫుడ్ కంపోజిషన్

పూర్తిగా బోన్‌లెస్‌ చికెన్‌ మాదిరిగా ఉండే ఈ చికెన్‌ శాఖాహారులకు మంచి ప్రత్యామ్నాయం ఎఫ్‌డీఏ అనుమతితో అమెరికాలో ‘అప్‌సైడ్‌ ఫుడ్స్‌’ అనే సంస్థ ‘సెల్‌ కల్చర్డ్‌ చికెన్‌’ను ఉత్పత్తి చేస్తోంది.

పలు స్టార్టప్‌ ఫుడ్‌ కంపెనీలు ఈ తరహా మాంసం ఉత్పత్తికి సన్నాహా­లు చేస్తున్నాయి. భవిష్యత్‌లో  కల్చర్డ్‌ మాం­సం ఉత్పత్తులు సింహభాగం మార్కెట్‌ను ఆ­క్ర­మిస్తాయని, ఈ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అమెరికన్లలో నూటికి 10 మంది కల్చర్డ్ చికెన్ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు

ప్రజలేమంటున్నారు?

ఏటా కోళ్లను వదించగా వెలువడుతున్న 10–12 శాతం కాలుష్యాన్ని  ఈ సెల్‌ కల్చర్డ్‌ చికెన్‌ ద్వారా చెక్‌ పెట్టవచ్చు

పర్యావరణానికి మేలు

కల్చర్డ్‌ ఆధారిత మాంసం ఉత్పత్తులకు భవిష్యత్‌లో మంచి డి మాండ్‌ ఉండనుంది. మాంసం మార్కెట్‌లో కనీసం 10 శాతం వాటా ఆక్రమిస్తుందని అంచనా

డిమాండ్ ఉంటుందా?

కల్చర్డ్ చికెన్ కోసం FDA అనుమతి పొందిన మొదటి కంపెనీగా అప్‌సైడ్ ఫుడ్స్ గుర్తింపు పొందింది.

ఎవరు తయారు చేస్తున్నారు?

భవిష్యత్‌లో ఇదే తరహాలో పశు మాంసం, ఎండ్రకాయలు, బాతు మాంసంతో పాటు ఇతర ఆహారాలను కూడా తయారు చేసే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

సెల్‌ కల్చర్డ్‌ చికెన్‌ ఈ ఏడాది నుంచే అమెరికన్‌ మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. మార్కెట్ విస్తరిస్తే  భారత్‌లో 2028నాటికి అందుబాటులోకి వస్తుంది.

ఈ ఏడాది నుంచే

మరిన్ని వెబ్‌స్టోరీస్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండి