IMAGE Tower: హైదరాబాద్‌లో మరో ఐకానిక్ స్టాచ్యూ.. ఇమేజ్ టవర్ ప్రత్యేకతలు ఇవే!
YouSay Short News App
హైదరాబాద్ నగరంలో మరో ఐకానిక్ నిర్మాణం ఇమేజ్ టవర్ (‘IMAGE Tower’) పూర్తి కానుంది
హైటెక్ సిటీలో దాదాపు 400 అడుగుల(120M) ఎత్తులో దీనిని నిర్మిస్తున్నారు
ఇమేజ్ టవర్ ఎత్తు.. తెలంగాణ సచివాలయం(265 ఫీట్స్) పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్(272 ఫీట్స్)ను అధిగమించింది
IMAGE Tower ను సత్వా గ్రూప్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యంతో నిర్మిస్తున్నాయి
ఇమేజ్ టవర్ ప్రాంగణంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్(AVGC) రంగాలకు చెందిన కంపెనీలు పనిచేయనున్నాయి.
హైటెక్ సిటీలో 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇది రూపుదిద్దుకుంటోంది
ఇమేజ్ టవర్ వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్టక్చర్‌తో నిర్మితమవుతోంది. AVGC పరిశ్రమలకు అవసరమైన ఆధునాతన సౌకర్యాలు ఇందులో కల్పిస్తున్నారు
18,000-20,000 వరకు ఉద్యోగులు ఏకకాలంలో పనిచేసే సామర్థ్యంతో ఇమేజ్ టవర్‌ను నిర్మిస్తున్నారు
తక్కువ రేటులో AVGC పరిశ్రమలకు కావాల్సిన ఆఫీస్ ప్రాంగణాలను ఇది అందివ్వనుంది
టెక్నోక్రాట్ ఇంటర్‌ప్రైజెస్, చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలు పనిచేసేందుకు వీలుగా దీన్ని నిర్మిస్తున్నారు
ఈ ఏడాది చివరి నాటికి నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ ఇటీవల పేర్కొన్నారు
ఇమేజ్ టవర్ నిర్మాణం పూర్తైతే.. హైదరాబాద్ యానిమేషన్ హబ్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు
మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Anupama Parameswaran
Download Our App