IND VS AUS రెండో టెస్ట్ డే2 హైలైట్స్‌

YouSay Short News App

రెండో రోజు టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాట్స్‌మెన్‌ కేఎల్ రాహుల్ 17 పరుగులకే వెనుదిరిగి మళ్లీ నిరాచపరిచాడు.

నిలకడగా ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మను నాథన్ లియాన్ బౌల్డ్‌ చేసి పెవిలియన్ చేర్చాడు. 32 పరుగుల వద్ద రోహిత్ ఔట్ అయ్యాడు.

నాథన్ లియాన్ తన  స్పిన్ మాయాజాలాన్ని కొనసాగించాడు. నయా వాల్ పుజారాతో పాటు శ్రేయస్ అయ్యర్‌ వికెట్లను తీశాడు. అయ్యర్ క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్నాడు పీటర్ హ్యాండ్ స్కాంబ్.

నాలుగు వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకునేందుకు రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, ఆల్‌ రౌండర్‌ జడేజా  ప్రయత్నించారు.

కోహ్లీ 44 పరుగుల వద్ద ఉన్నప్పుడు థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. బంతి బ్యాట్‌కు తగిలినట్లు ఉన్నా ఔట్ ఇవ్వటంపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అక్షర్ పటేల్‌ మరోసారి ఆల్‌ రౌండ్ ప్రదర్శన చేశాడు. 136 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినప్పటికీ 74 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు సాధించేలా చేశాడు అక్షర్.

అక్షర్ పటేల్‌కు అశ్విన్ కూడా జత కలిశాడు. 37 రన్స్‌ చేసి కీలక భాగస్వామ్యం నెలకొల్పేందుకు సహాయ పడ్డాడు.

ఆసీస్‌లో నాథన్‌ లియాన్‌ స్పిన్ మాయాజాలంతో 5 వికెట్లు తీసి టీమిండియా టాప్‌ ఆర్డర్‌ను కుప్ప కూల్చాడు.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 261 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియాకు కేవలం ఒక్క పరుగు ఆధిక్యం మాత్రమే దక్కింది.