ఇండోర్‌లో ప్రారంభమైన మూడో టెస్టు తొలిరోజు భారత్ పూర్తిగా తేలిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా భారీ స్కోరు చేయలేకపోయింది.
పిచ్ ప్రభావమో, ఆసీస్ స్పిన్నర్ల మాయాజాలమో, భారత బ్యాటర్ల నైపుణ్యత కొరవడటమో.. ఫలితంగా మరో చేదు అనుభవాన్ని భారత్ మూటగట్టుకుంది. 109 పరుగులకే ఆలౌటైంది.
109 పరుగులకే..
తొలి ఇన్నింగ్స్‌లో తొలి బంతికే శకునం మొదలైంది. ఫస్ట్ బాల్‌కు రోహిత్ ఔట్ కావాల్సింది. కానీ, ఆసీస్ డీఆర్ఎస్ తీసుకోలేదు. ఇదే ఓవర్ నాలుగో బంతికి ఎల్బీడబ్ల్యూగా రోహిత్ వెనుదిరగల్సింది. అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో ఆస్ట్రేలియా రివ్యూ కోరలేదు.
తొలి బంతికే..!
రెండు జీవనదానాలు పొందిన రోహిత్ శర్మ ఎక్కువ సమయం పాటు క్రీజులో నిలబడలేదు. 12 పరుగులు చేసి కున్‌మెన్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు.
ఈ సారి తప్పలేదు..
27 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. వరుసగా వికెట్ల పతనం మొదలైంది.
పతనం మొదలు..
స్కోరు బోర్డు వద్ద 34 పరుగులు కాగానే మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(21) ఔటయ్యాడు. కున్‌మెన్ బౌలింగ్‌లో స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
గిల్ క్యాచ్ ఔట్..
వన్‌డౌన్‌లో వచ్చిన పుజరా కూడా పూర్తిగా నిరాశ పరిచాడు. కేవలం ఒక పరుగు చేసి లయన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి స్కోరు 36/3.
ఒక పరుగుకే..
వరుస వికెట్ల పతనంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్‌లో మార్పులు చేసింది. శ్రేయస్ అయ్యర్‌ని నిలువరించి జడేజాను ముందు పంపించింది.
లైనప్‌లో మార్పు..
వికెట్ల పతనాన్ని అడ్డుకుంటాడని భావించిన జడ్డూ కూడా నిరాశ పరిచాడు. 9 బంతుల్లో 4 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు.
నిరాశ పరిచిన జడ్డూ..
కెరీర్‌లో 100వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న శ్రేయస్ అయ్యర్ మరోసారి డకౌట్ అయ్యాడు. కున్‌మెన్ వేసిన బంతిని సరిగా అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
శ్రేయస్ డకౌట్..
సొంతగడ్డపై 200వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ కాసేపు నిలబడ్డట్టే కనిపించాడు. వరుసగా వికెట్లు పడుతున్నా మరో ఎండ్‌లో కోహ్లీ ఉన్నాడన్న ధైర్యం ఎంతో సేపు నిలవలేదు. 22 పరుగులు చేసి కోహ్లీ ఎల్బీగా వెనుదిరిగాడు.
కోహ్లీ కూడా..
ఆంధ్రా కుర్రాడు శ్రీకర్ భరత్ అద్భుతం చేస్తాడేమో అని క్రికెట్ ప్రేక్షకులు ఊహించారు. తనను తాను నిరూపించుకోవడానికి భరత్‌కి ఇది చక్కటి సమయం అని భావించారు. అయితే, 17 పరుగులకే వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఔటయ్యాడు.
భరత్‌పై ఆశలు పెట్టుకున్నా..
లంచ్ బ్రేక్ తర్వాత అశ్విన్(3) త్వరగానే ఔటయ్యాడు. ఉమేశ్ యాదవ్(17) ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. సిరాజ్ రనౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఉమేశ్ ధాటిగా..
ఆస్ట్రేలియా బౌలర్లలో కున్‌మెన్ 4 వికెట్లు తీసుకోగా, లయన్ 3 వికెట్లు పడగొట్టాడు. టాడ్ మర్ఫీ ఒక వికెట్‌ని ఖాతాలో వేసుకున్నాడు.
కున్‌మెన్ మాయాజాలం..
బ్యాటింగ్‌కు వచ్చిన ఆస్ట్రేలియా మెరుగ్గా ఆడింది. 12కే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ రెండో వికెట్‌కి మెరుగైన భాగస్వామ్యం లభించింది.
12కే తొలి వికెట్
ఖవాజా(60), లబుషేన్(31), స్మిత్(26) రాణించడంతో ఆస్ట్రేలియా 156 పరుగులు చేసింది. 4 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం హ్యాండ్‌స్కాంబ్, గ్రీన్ క్రీజులో ఉన్నారు. తొలి రోజు ముగిసే సరికి ఆసీస్ 47 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఆధిక్యంలోకి ఆసీస్..
జడేజా ఒక్కడే నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్, అక్షర్ వికెట్ కోసం తీవ్రంగా శ్రమించారు.