IND vs AUS:
చేతులెత్తేసిన భారత్.. గెలవాలంటే అద్భుతమే జరగాలి!
YouSay Short News App
మూడో టెస్టు రెండో రోజు ఆటలో భారత్ సెకండ్ ఇన్నింగ్స్ ముగిసింది. మరోసారి చతికిల పడుతూ 163 పరగులకే ఆలౌటైంది.
పుజారా(59) మినహా ఎవరూ రాణించలేదు. వచ్చిన బ్యాట్స్‌మన్ వచ్చినట్లు తిరిగి వెళ్లిపోయారు.
88 పరుగుల వెనుకంజతో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ని ఆరంభించింది. ఓపెనర్లు గిల్(5), రోహిత్(12) మరోసారి విఫలమయ్యారు.
ఇండియా ఇన్నింగ్స్
విరాట్(13), జడేజా(7), శ్రీకర్ భరత్(3), అశ్విన్(16) వెనువెంటనే పెవిలియన్ చేరారు.
శ్రేయస్ అయ్యర్(26) కాసేపు నిలబడ్డాడు. పుజారాతో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
అక్షర్ పటేల్(15*) మరోసారి నాటౌట్‌గా నిలిచాడు. ఉమేశ్, సిరాజ్ డకౌట్ అయ్యారు.
ఆసీస్ బౌలర్లలో నాథన్ లైయన్ విజృంభించాడు. ఒక్కడే 8 వికెట్లు తీసుకుని భారత పతనాన్ని శాసించాడు.
156/4తో రెండో రోజును ఆరంభించిన ఆస్ట్రేలియా తొలి సెషన్‌లో తడబడింది. కెమెరాన్ గ్రీన్, పీటర్ హ్యాండ్‌స్కాంబ్ కలిసి 30 పరుగులు జోడించారు.
ఆసీస్ ఇన్నింగ్స్
186/4 పరుగులతో పటిష్ఠ స్థితిలో ఉన్న ఆస్ట్రేలియా ఒక్కసారిగా పతనమైంది. 197 పరుగులకే ఆలౌటైంది.
11 పరుగుల వ్యవధిలోనే ఆసీస్ 6 వికెట్లు కోల్పోయింది. ఉమేశ్ యాదవ్(3), అశ్విన్(3) కంగారూల భరతం పట్టారు.
ఆసీస్ ఇన్నింగ్స్‌ని కట్టడి చేసి లీడ్‌ని తగ్గించుకున్న టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో ఆ జోష్‌ని కొనసాగించలేక పోయింది. దీంతో 163 పరుగులకే ఆలౌటైంది.
ఆస్ట్రేలియా టార్గెట్ 75 పరుగులు. ఆటకు ఇంకా
3 రోజుల సమయం ఉంది. అద్భుతం జరిగితే తప్ప భారత్ గెలిచే అవకాశం లేదు.