IND vs AUS: మూడో టెస్టులో భారత్‌ ఘోర ఓటమి.. కారణాలివే!

YouSay Short News App

బోర్డర్‌ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు 7 సెషన్లు కూడా పూర్తికాకుండానే ముగిసింది. ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. సిరీస్‌లో తొలి పరాజయాన్ని చవిచూసింది.

మ్యాచ్ మొదలైనప్పటి నుంచి భారత్ తడబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన తొలి ఇన్నింగ్స్‌లో 109కే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ 163కి కుప్పకూలింది.

ఆది నుంచి..

ఆస్ట్రేలియా మాత్రం తొలి ఇన్నింగ్స్‌ని గొప్పగా ఆరంభించింది. 197 పరుగులు చేసి 88 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో 76 పరుగుల లక్ష్యాన్ని సులువుగా ఛేదించింది.

ఆస్ట్రేలియా మెరుగ్గా..

సాధారణంగా భారత పిచ్‌లు స్పిన్‌కు అనుకూలం. కానీ, మూడో టెస్టుకి వేదికైన ఇండోర్ పిచ్ తొలి సెషన్‌ నుంచే ప్రభావం చూపించింది. బంతి అనూహ్యంగా బౌన్స్ అవడం, పూర్తిగా టర్న్ కావడం మొదలైంది.

ఇదేం పిచ్..?

వాస్తవానికి మూడో టెస్టుకి ధర్మశాల వేదిక. అక్కడ పిచ్ పూర్తిగా సిద్ధం కాకపోవడం వల్ల వేదికను ఇండోర్‌కు మార్చారు. అయితే, టెస్టు మ్యాచ్‌కు పిచ్‌ని రెడీ చేయడానికి కనీసం నెల రోజులు పడుతుంది. ఆ సమయం లేకపోవడం ప్రతికూలంగా మారింది.

సమయం చాలలేదు..

ప్రత్యర్థిని స్పిన్ వలలో వేసుకుని విజయాలు సాధించాలని భారత్ భావించింది. అందుకు స్పిన్ పిచ్‌లను తయారు చేయించింది. అయితే, ఈ సారి ప్లాన్ తిరగబడింది. ఆసీస్ స్పిన్‌కు మనోళ్లు దాసోహమయ్యారు.

తిరగబడింది..!

పిచ్ అనూహ్యంగా స్పందిస్తుండటం, టర్న్ ఎక్కువగా లభిస్తుండటంతో స్పిన్నర్లు విజృంభించారు. ఆసీస్ ప్లేయర్లు నేథన్ లైయన్(11), కునెమన్(6) భారత్‌ను పడగొట్టారు. భారత స్పిన్నర్లు జడేజా(4), అశ్విన్(4) వికెట్లు తీశారు.

స్పిన్నర్లదే హవా..

ఆస్ట్రేలియా, భారత్ ఇన్నింగ్స్‌లకు ప్రధాన తేడా బ్యాటింగే. ప్రత్యర్థి బ్యాటర్లు కాసేపు క్రీజులో నిలబడి పరుగులు చేస్తే.. మనోళ్లు బోల్తా పడ్డారు. బంతిని సరిగా అంచనా వేయలేక వికెట్ల ముందు దొరికిపోయారు. కొందరైతే వికెట్ సమర్పించుకున్నారు.

బ్యాటింగ్ వైఫల్యం..

ఈ టెస్టులో పుజారా మినహా భారత్‌లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ను ఎవరూ ఆడలేదు. రెండో ఇన్నింగ్స్‌లో పుజారా(59) చేయడం వల్లే భారత్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.

పుజారా మినహా..

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ పుంజుకున్నట్లే కనిపించింది. శ్రేయస్, పుజారా క్రీజులో కుదురుకున్నారు. అయితే, ఆసీస్ ఫీల్డర్లు అద్భుత క్యాచ్‌లతో వీరిద్దరినీ పెవిలియన్ పంపించారు. శ్రేయస్‌ క్యాచ్‌ని ఖవాజా డైవ్ చేసి అందుకోగా, పుజారా క్యాచ్‌‌ని లెగ్ స్లిప్‌లో ఉన్న స్మిత్ ఒంటి  చేత్తో పట్టాడు.

ఈ రెండు క్యాచ్‌లు..

ఈ టెస్టు కూడా తొలి మూడు రోజుల్లోనే ముగియడం గమనార్హం. తొలి రెండు టెస్టులు  3 రోజుల్లోనే పూర్తయ్యాయి.

మూడో టెస్టు కూడా..

మూడో టెస్టులో ఓడినప్పటికీ సిరీస్‌లో భారత్  2-1తో లీడ్‌లో ఉంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కి అర్హత సాధించాలంటే భారత్ నాలుగో టెస్టు తప్పక గెలవాలి.

తప్పక గెలవాలి..

మూడో టెస్టుతో భారత్, ఆసీస్ ప్లేయర్లు కొన్ని రికార్డులు నమోదు చేశారు.

రికార్డులు..

అన్ని ఫార్మాట్లలో కలిపి భారత ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటివరకు 690 వికెట్లు తీశాడు. దీంతో ఈ జాబితాలో కపిల్ దేవ్(687)ను అధిగమించాడు. కుంబ్లే(953), హర్భజన్(707) ముందున్నారు.

కపిల్‌ను దాటిన అశ్విన్..

ఆసియా గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన ఓవర్‌సీస్ బౌలర్‌గా నేథన్ లైయన్(137*) నిలిచాడు. షేన్ వార్న్(127) రికార్డును అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

తొలి బౌలర్‌గా లైయన్

ఇండియా        109 & 163 ఆస్ట్రేలియా     197 & 78/1

స్కోర్లు

మేము అంత గొప్పగా బ్యాటింగ్‌ చేయలేదు. ఇలాంటి పిచ్‌లపై ధైర్యంగా ఆడాలి కానీ మాలో  అది లోపించింది.                                      - రోహిత్