కొత్త సంవత్సరంలో టీమిండియా దూసుకెళ్తోంది. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
3 మ్యాచుల వన్డే సిరీస్‌ని మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీమిండియా కైవసం చేసుకుంది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌పై సిరీస్ విజయం సాధించడం వరుసగా ఇది 7వ సారి.
న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో టీమిండియా విజయానికి కారణం బౌలింగే. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. 108 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసింది.
ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే బౌలింగ్ దాడి ప్రారంభించింది టీమిండియా. 5వ బంతికే ఫిన్ అలెన్‌ని బౌల్డ్ చేసి షమి ఖాతా తెరిచాడు.
8 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగులో నికోల్స్ వెనుదిరిగాడు. మరో 7 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ బ్యాటింగ్ దళాన్ని బౌలర్లు దెబ్బతీశారు.
ఈ మ్యాచులో రెండు అద్భుత రిఫ్లెక్స్(బౌలర్ పట్టడం) క్యాచ్‌లు నమోదయ్యాయి. ఒకటి షమి అందుకుంటే, మరొకటి ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఒంటి చేత్తో పట్టాడు.
బౌలర్ల సమిష్టి కృషి ఫలితం ఇది. షమి 3 వికెట్లు తీసుకోగా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. కుల్‌దీప్, సిరాజ్, శార్దూల్ తలో వికెట్ పడగొట్టారు.
తొలి పది ఓవర్లు పూర్తయ్యే సరికి న్యూజిలాండ్ స్కోరు 15/5. వన్డేల్లో అతి తక్కువ స్కోరుకే సగం వికెట్లు కోల్పోయిన జట్టుగా న్యూజిలాండ్ చెత్త రికార్డు నమోదు చేసింది.
స్వల్ప లక్ష్య ఛేదనలో టీమిండియా ఎక్కడా తడబడలేదు. మరోసారి ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. రోహిత్, గిల్ కలిసి 72 పరుగులు జోడించారు.
రోహిత్(51) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కోహ్లీ(11) త్వరగానే వెనుదిరిగాడు. అనంతరం ఇషాన్ కిషన్(8*)తో కలిసి గిల్(40*) టార్గెట్‌ని పూర్తి చేశాడు.
టాస్‌ని టీమిండియా గెలిచింది. అయితే, బ్యాటింగా, బౌలింగా ఎంచుకోవడంలో రోహిత్ తడబడ్డాడు. రోహిత్ భయ్యా కన్ఫూజ్ అయ్యాడని ఫ్యాన్స్ గేలి చేశారు.
మ్యాచ్ జరుగుతుండగా రోహిత్‌ని హత్తుకోవడానికి ఓ అభిమాని దూసుకొచ్చాడు. పరుగెత్తుకుంటూ వచ్చి హిట్‌మ్యాన్‌ని హగ్ చేసుకున్నాడు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్సులో భారత్ మూడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు న్యూజిలాండ్ టాప్ ర్యాంకును కోల్పోయి రెండో స్థానానికి దిగజారింది.
స్కోర్లు: న్యూజిలాండ్ 108/10; భారత్ 111/2 (20.1)మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: మహ్మద్ షమి