మూడో వన్డే వర్షార్పణం సిరీస్ కివీస్ వశం

YouSay Short News App

INDvsNZ

ప్రపంచ కప్ తర్వాత యువజట్టుతో న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటించింది. రోహిత్ , రాహుల్, కోహ్లీ లేకపోయినా పాండ్యా సారథ్యంలో టీ-20 సిరీస్‌ను నెగ్గింది.

అదే జోష్‌లో వన్డే కప్పు కొట్టాలని భావించిన భారత జట్టు...సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయింది. మూడో వన్డేలోనూ ఆశించిన స్థాయిలో రాణించలేదు. బౌలర్లు తేలిపోవటం, మిడిలార్డర్ వైఫల్యం అంతకుతోడు వర్షం అన్ని కలిసి ట్రోఫీని కివీస్ వశం చేశాయి.

టాస్

న్యూజిలాండ్ తో నిర్ణయాత్మక వన్డేలో భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ముచ్చటగా మూడో వన్డేలోనూ శిఖర్ ధావన్ టాస్ ఓడిపోయాడు. కివీస్‌కు మెుదట్నుంచే కలిసి  వచ్చింది.

గిల్, ధావన్ వికెట్లు

కివీస్ బౌలింగ్ ఎంచుకోవటంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభం ఇవ్వలేకపోయారు. ఇప్పటికే దాదాపు 10 మ్యాచుల్లో మంచి ఆరంభాన్ని ఇచ్చిన ధావన్(28), గిల్(13) జోడి మూడో వన్డేలో తేలిపోయారు. ఇద్దరు మిల్నే బౌలింగ్‌లో ఔట్ అయ్యారు.

శ్రేయాస్ అయ్యర్

ఓపెనర్లు పెవిలియన్ చేరటంతో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కాస్త కుదురుకునేందుకు ప్రయత్నించాడు. 49 పరుగులు చేసి అర్థ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

మిడిలార్డర్ వైఫల్యం

కొద్దికాలంగా టీమిండియాను వేధిస్తున్న మిడిలార్డర్ సమస్య కాస్త తగ్గిందని అనుకున్నా పాండ్యా లేకపోవటంతో కొట్టొచ్చినట్లు కనిపించింది. రిషబ్ పంత్(10), సూర్యకుమార్ యాదవ్(6), దీపక్ హుడా(12) క్రీజులో నిలబడలేకపోయారు.

ప్చ్…పంత్

వికెట్లు త్వరగా పడటంతో సూర్య కుమార్ కంటే ముందుగా బ్యాటింగ్ కు వచ్చిన పంత్ మళ్లీ నిరాశ పరిచాడు. ఈ ఇన్నింగ్స్‌లోనైనా తనదైన ప్రదర్శన ఇస్తాడునుకున్న ఎదురుచూసిన ఫ్యాన్స్ ఆశలు ఆడియాశలయ్యాయి.

వాషింగ్టన్ సుందర్

మెుదటి వన్డేలో చివర్లో మెరుపులు మెరిపించి భారత్ కు 300 మార్క్ స్కోరు అందించిన ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్(51) మరోసారి జట్టును ఆదుకున్నాడు. కీలక సమయంలో అర్ధ సెంచరీ చేశాడు.

వావ్..ఏం కొట్టారు

టపటపా వికెట్లు రాలుతుంటే బ్యాటింగ్‌కు దిగిన దీపక్ చాహర్ రెండు సిక్సులు బాదాడు. బౌలర్ అర్షదీప్ సింగ్ కొట్టిన సిక్సులు కూడా ఆకట్టుకున్నాయి.

కివీస్ సూపర్ ఓపెనింగ్

చిన్నలక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్ క్యాప్స్ ఓపెనింగ్ జోడి అదరగొట్టారు. మెుదటి వికెట్ కు 97 పరుగల భాగస్వామ్యం అందించారు.

మళ్లీ వచ్చాడు

18 ఓవర్లు ముగిసే సరికి వరణుడు ఆటంకం కలిగించడం ఆ తర్వాత ఎంతకూ వాన తగ్గకపోవడంతో మ్యాచ్‌ రద్దయింది. దీంతో 1-0 తేడాతో సిరీస్ కివీస్ సొంతమైంది.

DLS ఎందుకు పరిగణించలే!

DLS ప్రకారం న్యూజిలాండ్‌ 18 ఓవర్లకే 50 పరుగులు ముందు ఉన్నప్పటికీ DLS పరిగణలోకి తీసుకోవాలంటే కనీసం 20 ఓవర్లు ఆడాలి. దీంతో 2 ఓవర్లు వెనకబడి ఉండటంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.

కొత్త కథ, నేటి యువతకు తప్పకుండా నచ్చే సినిమా. ఈ వీకెండ్‌లో ప్రెండ్స్‌తో ప్లాన్‌ చేసుకోండి. తప్పక ఎంజాయ్ చేస్తారు

యాద్ధృచ్ఛికం

టీ-20 సిరీస్ లోనూ వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దు అవ్వటంతో పాటు మరొకటి టై కావటంతో ఇండియాకు సిరీస్ దక్కింది. ఇప్పుడు వన్డే సిరీస్ లోనూ రెండు మ్యాచ్ లు రద్దు అవ్వటంతో బ్లాక్ క్యాప్స్ కప్పు కొట్టింది.