క్రికెట్‌లో ఈ ఏడాది అదరగొట్టిన  భారత ఆటగాళ్లు

YouSay Short News App

మూడేళ్ల తర్వాత విరాట్ కోహ్లీ సెంచరీలు. ఆసియా, ప్రపంచ కప్‌లో మర్చిపోలేని ఇన్నింగ్స్‌లు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ మెరుపులు.

టీంలోనే వద్దనుకున్న పాండ్యాకే పగ్గాలు. దేశవాలీ క్రికెట్‌లో అదరగొట్టిన కుర్రాళ్లు. ఇలా ఈ ఏడాది ఎన్నో విషయాలు క్రికెట్ అభిమానులను అలరించాయి.

కోహ్లీ...కోహ్లీ...కోహ్లీ

గడిచిన మూడేళ్ల నుంచి క్రికెట్ అంటే ఎవరి నోట విన్నా కోహ్లీ పేరే. ఫామ్ లేదని చోటు కల్పించి దండగని ఇలా ఎన్నో కామెంట్స్. కానీ, వాటన్నింటిని ఈ రన్‌ మిషన్ పటా పంచలు చేశాడు. మళ్లీ ఫామ్ లోకి వచ్చి తనదైన ఆటతో పరుగుల వరద పారిస్తున్నాడు.

ఆసియా, ప్రపంచకప్‌

ఆసియా కప్‌ కంటే ముందు ఫామ్‌లోకి వచ్చిన కింగ్ కోహ్లీ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అఫ్గానిస్తాన్‌పై టీ-20ల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు.

ప్రపంచకప్‌లో పాక్‌పై వీరోచిత ఇన్నింగ్స్‌ను ఎవ్వరూ మర్చిపోలేరు. హరీస్‌ రౌఫ్‌ బౌలింగ్‌ రెండు సిక్సులు ఎఎప్పటికీ గుర్తిండిపోతాయి. ముఖ్యంగా బ్యాక్‌ ఫూట్ స్ట్రైట్ సిక్స్‌ అదిరిపోతుంది.

మిస్టర్‌ 360 హంగామా

టీమిండియాకు ఈ ఏడాది బెస్ట్‌ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. ఈ ఏడాది  ఆడిన సిరీస్‌లన్నింటిలో  మెరుపులు మెరిపించాడు. మైదానం నలుమూలల  షాట్స్ కొడుతూ రెచ్చిపోయాడు. 31 మ్యాచ్‌లలో  1164 పరుగులు చేశాడు.

హార్దిక్ పాండ్యా

గతేడాది ఫిట్‌నెస్‌ కోల్పోయిన పాండ్యా ఇక జట్టులోకి రావటం కష్టమే అనుకున్నారు అంతా. కానీ, ఐపీఎల్‌లో గుజరాత్‌ కెప్టెన్‌గా టైటిల్ కొట్టడమే కాకుండా టీమిండియాకు కొన్ని సిరీస్‌లకు  సారథ్యం వహించాడు.

ఇషాన్ కిషన్

టీమిండియా చోటు దక్కించుకుంటున్నప్పటికీ ఎక్కువగా మ్యాాచ్‌లు ఆడే అవకాశం ఇషాన్‌కి రాలేదు. కానీ, రోహిత్ గాయంతో బంగ్లాతో మ్యాచ్‌కు ఎంపికై బీభత్సమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. డబుల్ సెంచరీ చేసి తన సత్తా చాటాడు.

కుర్రాళ్లు కిర్రాక్

దేశవాలీ క్రికెట్‌ టోర్నమెంట్‌లలో యువ ఆటగాళ్లు ప్రతిభ చాటుతున్నారు. పిచ్‌ ఏదైనా, బౌలర్‌ ఎవరైనా తగ్గేదే లే. విజయ్ హజరే, ముస్తక్ అలీ ట్రోఫీల్లో వీర బాదుడు బాది అందర్ని ఆకర్షించారు.

ఎన్ జగదీశన్

జగదీశన్ కొద్దిమందికి మాత్రమే తెలిసిన పేరు. ఇతను చెన్నై జట్టు తరఫున ఐపీఎల్‌ ఆడాడు. విజయ్ హజారే ట్రోఫీలో రికార్డులు బద్దలు కొట్టాడు. 277 పరుగుల అత్యధిక స్కోర్ చేయటంతో పాటు 5 సెంచరీలు కొట్టి 830 పరుగులు సాధించాడు.

రుతురాజ్ గైక్వాడ్

టీమిండియాలో ఇప్పటికే చోటు దక్కించుకొని టాలెంట్‌ను నిరూపించుకుంటున్న రుతురాజ్ గైక్వాడ్‌ విజయ్ హజారే టోర్నమెంట్‌లో చెలరేగిపోయాడు. డబుల్ సెంచరీతో పాటు 4 సెంచరీలు చేశాడు. రెండో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

సాయి సుదర్శన్

సాయు సుదర్శన్ విజయ్ హజారే ట్రోఫీలో మూడో టాప్‌ స్కోరర్. 3 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు కొట్టాడు. సాయి సుదర్శన్ ఐపీఎల్‌లో గుజరాత్‌ తరఫున ఆడి కొన్ని మ్యాచ్‌లను గెలిపించాడు.

అంకిత్ భవే

మహారాష్ట్ర తరఫున ఆడుతున్న అంకిత్ భవే దేశవాలీ క్రికెట్‌ టోర్నమెంట్‌లలో రాణిస్తున్నాడు. ఇటీవల 184 పరుగులు వ్యక్తిగత స్కోరు సాధించాడు. టీమిండియాలో చోటు సంపాదించేందుకు కష్టపడుతున్నాడు.

అర్షదీప్ సింగ్

యార్కర్ కింగ్ బుమ్రా జట్టుకు దూరం కావటంతో అర్షదీప్‌ సింగ్‌కు అవకాశం దక్కింది. అందిపుచ్చుకున్న అర్షదీప్‌ అద్భుతమైన యార్కర్లతో వికెట్లు పడగొట్టాడు. చివరి ఓవర్ వేసేందుకు కెప్టెన్ రోహిత్ అర్షదీప్‌ను ఎంచుకున్నాడంటే అతడి సామర్థ్యం అర్థం చేసుకోవచ్చు.

ఉమ్రాన్ మాలిక్

జమ్ము కశ్మీర్‌ నుంచి వచ్చిన ఈ స్పీడ్‌ గన్‌ ఇటీవల బంగ్లాదేశ్ సిరీస్‌లో రాణించాడు. ఆడిన మెుదటి మ్యాచ్‌లోనే బంగ్లా సీనియర్ బ్యాట్స్‌మెన్‌ షకీబ్‌ను భయపెట్టాడు. 150 కన్నా వేగంతో బంతులు విసిరి ఐపీఎల్‌లోనూ రికార్డు సృష్టించాడు.