హైదరాబాద్‌లో ఏటీఎం ఇప్పుడు ఓ సంచలనం. అదేలా అనుకుంటున్నారా ? ఇప్పుడు కార్డు పెడితే డబ్బు కాదు ఏకంగా బంగారం వస్తుంది. ఇది కాస్త ఆశ్చర్యమే అయినా ఆచరణలోకి వచ్చింది కనుక నమ్మాల్సిందే. మరి ఆలస్యమెందుకు గోల్డ్ ఏటీఎం గురించి తెలుసుకోండి.
ఎక్కడ
దేశంలోనే మెుట్టమెుదటి గోల్డ్ ఏటీఎంను హైదరాబాద్‌లోని బేగంపేటలో ప్రారంభించారు. గోల్డ్ సిక్కా సంస్థ ఓపెన్ క్యూబ్ టెక్యాలజీస్ అనే స్టార్టప్‌తో కలిసి ఈ ATMను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ గోల్డ్ ఏటీఎం 24*7 పనిచేస్తుంది. వినియోగదారులు ఎవరైనా బంగారాన్ని దీని ద్వారా ఎప్పడంటే అప్పుడు కొనుగోలు చేయవచ్చు.
కార్డులు
ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్ వంటి స్మార్ట్ కార్డుల ద్వారా కూడా బంగారాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.
ఎంత తీసుకోవచ్చు
ఈ ఏటీఎం ద్వారా 0.5 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు విత్ డ్రా చేయవచ్చు. క్వాలిటీకి సంబంధించి ఎటువంటి అనుమానం అక్కర్లేదు. 24 క్యారెట్ కచ్చితంగా ఉంటుందని సంస్థ చెప్పింది.
ఏం వస్తాయి
గోల్డ్ తీసుకున్నప్పడు బంగారంతో పాటు వాటి నాణ్యత, గ్యారంటీ తెలిపే పత్రాలు కూడా జారీ అవుతాయి.
ఏటీఎం నిల్వలు
ఒక్కో ఏటీఎంలో సుమారు 5 కిలోల బంగారం ఉంటుంది. దీని విలువ దాదాపు 2-3 కోట్లు. ఇందులో 8 ఆప్షన్లు ఉంటాయి. 0.5గ్రాములు, 1 గ్రామ్ నుంచి 2,5,10,20,50,100 గ్రాముల వరకు ఎంపిక చేసుకోవచ్చు.
ధరలు
బంగారం ధరలు ఎప్పటికప్పుడు స్క్రీన్‌పై కనిపిస్తాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ఆటోమేటిక్‌గా మారుతుంటాయి.ధరలు
భద్రత
మెషిన్ లోపల సీసీ కెమెరాతో పాటు బయట కూడా అమర్చారు. అలారం సిస్టమ్‌ను అందుబాటులో ఉంచారు. వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా కస్టమర్ సపోర్ట్‌ను కూడా పెట్టారు.
గ్రామీణ ప్రాంతాలకు
హైదరాబాద్ బేగంపేటలో ప్రస్తుతం ATM ఏర్పాటు చేసిన గోల్డ్ సిక్కా. నగరవ్యాప్తంగా విస్తరించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది.
ఎక్కడెక్కడ?
విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లోని గుల్జరాహౌస్, సికింద్రాబాద్, అబిడ్స్‌తో పాటు, పెద్దపల్లి, వరంగల్, కరీంనగర్‌లోనూ త్వరలోనే నెలకొల్పనున్నారు.