భారత్‌ దారుణ పరాజయం

YouSay Short News App

INDvsBAN

ఎన్నో మలుపులు తిరుగుతూ ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చివరికి బంగ్లా విజేతగా నిలిచింది. KL రాహుల్‌ మినహా ఇండియా బ్యాటర్లు విఫలమైన వేళ, బౌలర్లలో సిరాజ్‌ 3 వికెట్లతో మెరిశాడు.

ఓ దశలో బంగ్లా సులభంగా గెలుస్తుందనుకుటుండగా మరో 51 పరుగులు కావాల్సిన సమయానికి 9 వికెట్లు కోల్పోయింది. ఇక ఇండియా గెలుపు ఖాయమనుకుంటే…మెహదీ హసన్‌ ఒక్కడే ఇండియాకు చుక్కలు చూపించాడు.

ఓవర్లు 1-6

టాస్‌ ఓడిన టీమిండియా రోహిత్‌-ధావన్‌తో బ్యాటింగ్‌కు దిగింది. మెహదీ హసన్‌ వేసిన 6వ ఓవర్లో శిఖర్‌ ధావన్‌ చెత్త షాట్‌ ఆడి ఔటయ్యాడు. ఏ మాత్రం అవసరం లేని చోట రివర్స్‌ స్వీప్‌నకు ప్రయత్నించి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు.

టాప్‌ లేపేసిన షకిభ్‌

11వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన షకిభ్‌ అల్‌ హసన్‌ రావడంతో రోహిత్‌, కోహ్లీ ఇద్దరినీ పెవిలియన్‌ బాట పట్టించాడు. రోహిత్‌ 27(31) డిఫెన్స్‌ కోసం యత్నించగా బంతి ఎడ్జ్‌ తీసుకుని వికెట్లను గిరాటేసింది.

లిటన్‌ అద్భుత క్యాచ్‌

11 ఓవర్‌లో లిటన్‌ దాస్‌ అద్భుత క్యాచ్‌కు విరాట్‌ వెనుదిరగాల్సి వచ్చింది. షకిభ్‌ తెలివైన బౌలింగ్‌కు కవర్‌లో లిట్టన్‌ దాస్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు కోహ్లీ సైతం అవాక్కయ్యాడు.

నిరాశ పర్చిన శ్రేయస్‌, సుందర్

శ్రేయస్ అయ్యర్‌, సుందర్‌ కూడా ఆకట్టుకోలేకపోయారు. సుందర్‌ అనవసరంగా రివర్స్‌ స్వీప్‌నకు ప్రయత్నించి సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు

పెవిలియన్‌కు క్యూ

సుందర్‌ తర్వాత వరుస ఓవర్లలో షాబాజ్ అహ్మద్‌(0), షార్దుల్‌ ఠాకూర్‌(2), దీపక్‌ చాహర్‌(0) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఈ క్రమంలోనే షకిభ్ అల్‌ హసన్‌ 5 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

రాహుల్ ఒంటరి పోరాటం

మరో ఎండ్‌లో ఒంటరి పోరాటం చేసిన రాహుల్‌ 73 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఇబాదత్‌ హుస్సేన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. టీమిండియా 186 పరుగులకే చాప చుట్టేసింది.

ఇద్దరే 9 వికెట్లు

ఇబాదత్‌ హుస్సేన్‌, షకిభ్‌ ఇద్దరే 9 వికెట్లు తీసుకున్నారు. షకిభ్‌ తెలివిగా బౌలింగ్ చేస్తే, , ఇబాదత్ హుస్సేన్‌ పిచ్‌ అందించిన బౌన్స్‌ను చక్కగా వాడుకున్నాడు.

ఇండియాకు మంచి స్టార్ట్‌

సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు తొలి బంతికే దీపక్‌ చాహర్‌ షాక్‌ ఇచ్చాడు. షంటో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 10వ ఓవర్ తొలిబంతికి సిరాజ్‌ అనముల్‌ను పెవిలియన్‌ చేర్చాడు.

లిటన్‌ సింపుల్‌ క్యాచ్‌

నెమ్మదిగా ఆడుతూ క్రీజులో పాతుకుపోయిన లిటన్‌ దాస్‌ 41(63) వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో రాహుల్‌కు సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత బంతికే రాహిమ్ రనౌట్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

డ్రింక్స్ బ్రేక్‌ దాకా

బౌలింగ్‌తో అదరగొట్టిన షకిభ్‌ను 29 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద 24వ ఓవర్‌ వేసిన సుందర్‌ ఔట్‌ చేశాడు. లిటన్‌ దాస్‌ అద్భుత క్యాచ్‌కు ఔటైన కోహ్లీ షకిభ్‌ను ఓ అద్భుత క్యాచ్‌తో వెనక్కి పంపాడు. డ్రింక్స్‌ బ్రేక్‌ సమయానికి 29ఓవర్లలో 110-4 తో మ్యాచ్‌ బంగ్లా కంట్రోల్‌లోనే ఉంది.

టర్నింగ్‌ ఫేజ్‌

34 ఓవర్ల దాకా వికెట్‌ కోల్పోకుండా నెమ్మదిగా ఆడిన బంగ్లా 35వ ఓవర్‌ చివరి బంతికి షార్దుల్ బౌలింగ్‌లో మహ్మదుల్లా14(35), ఆ వెంటనే సిరాజ్‌ బౌలింగ్‌లో ముష్పికర్‌ రహీమ్ 18(45) బౌల్డ్‌ కావడంతో మ్యచ్‌ మళ్లీ బ్యాలన్స్‌ అయింది.

టీమిండియా చేతిలోకి గేమ్

39 ఓవర్‌లో కుల్దీప్‌ సేన్‌ బౌలింగ్‌లో ఆతిఫ్ హుస్సేన్‌ 6(12), ఇబాదత్‌ హుస్సేన్‌0(3)హిట్‌ వికెట్‌గా వెనుదిరగడంతో 135-8తో మ్యాచ్‌ భారత్‌ చేతిలోకి వచ్చింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే సిరాజ్‌ హసన్‌ మహ్ముద్‌ను డకౌట్‌ చేయడంతో భారత్‌ గెలుపు ఖాయమనుకున్నారు.

ఒక్కడే

బంగ్లా చేతిలో కేవలం ఒకటే వికెట్‌, ఇంకా 51 పరుగులు కావాలి. అలాంటి సమయంలో మెహదీ హసన్‌ మిరాజ్‌ 39(38) సెన్సేషనల్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. కుల్దీప్‌ సేన్‌ బౌలింగ్‌లో 14, చాహర్‌ బౌలింగ్‌లో 13 రన్లు బాదాడు.చివరిదాకా ఉండి భారత్‌కు మింగుడు పడని ఓటమిని చేతిలో పెట్టాడు.

కొత్త కథ, నేటి యువతకు తప్పకుండా నచ్చే సినిమా. ఈ వీకెండ్‌లో ప్రెండ్స్‌తో ప్లాన్‌ చేసుకోండి. తప్పక ఎంజాయ్ చేస్తారు

కొంప ముంచిన ఫీల్డింగ్

ఇంకా 30 పరుగులు అవసరం ఉన్న వేళ మిరాజ్‌ క్యాచ్‌ ఇచ్చినా సుందర్‌ దానికి ప్రయత్నించలేదు. ఒకవేళ ప్రయత్నించి క్యాచ్‌ పట్టుంటే ఫలితం మరోలా ఉండేది.