YouSay Short News App

INDvsSL: సిరీస్ కైవసం చేసుకున్న భారత్

మూడో టీ20లో శ్రీలంకపై టీమిండియా విజయం సాధించింది. 2-1 తో గెలిచి సిరీస్‌ని కైవసం చేసుకుంది.

3వ టీ20లో బ్యాటింగ్, బౌలింగులో టీమిండియా విజృంభించింది. 228 పరుగుల భారీ లక్ష్యాన్ని నెలకొల్పి.. శ్రీలంకను 137 పరుగులకే కుప్పకూల్చి.. 91 పరుగుల తేడాతో విజయం సాధించింది.

91 పరుగుల తేడాతో విజయం సాధించడం టీమిండియాకు ఇది తొలిసారి. ఓవరాల్‌గా భారత్ 4వ స్థానంలో నిలిచింది.

టీమిండియా ఇన్నింగ్సులో సూర్యకుమార్ యాదవ్ ఆటే హైలైట్. 51 బంతుల్లోనే 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.

టీ20ల్లో అత్యధిక వేగంగా 1500 పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ రికార్డు సృష్టించాడు. సూర్యకు కెరీర్‌లో  ఇది 3వ సెంచరీ. టీమిండియా తరఫున 3 సెంచరీలు చేసిన ఏకైక నాన్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ ఇతడే.

రెండో టీ20లో తేలిపోయిన బౌలర్లు.. ఈ మ్యాచులో సమిష్టిగా రాణించారు. హార్దిక్(2), చాహల్(2), ఉమ్రాన్(2), అర్షదీప్(3), అక్షర్ పటేల్(1) వికెట్లు తీశారు.

రెండు విభాగాల్లోనూ శ్రీలంక తేలిపోయింది. సూర్య సునామీని కట్టడి చేయలేక బౌలింగులో విఫలమైంది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బ్యాటింగ్ విభాగం చేతులెత్తేసింది.

తొలి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ వికెట్‌‌ను కోల్పోయింది టీమిండియా. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి స్వేచ్ఛగా ఆడాడు. బ్యాటు ఝులిపించి 16 బంతుల్లో 35 పరుగులు చేశాడు. గిల్(46), అక్షర్ పటేల్(21) రాణించారు.

సొంతగడ్డపై టీమిండియాకు ఎదురులేదు. 3 మ్యాచుల టీ20 సిరీసుల్లో జరిగే నిర్ణయాత్మక మ్యాచుల్లో విజయం సాధించడం వరుసగా ఇది 9వ సారి. ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు.

అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహల్ అవతరించాడు. 90 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఈ 3 మ్యాచుల టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్(170) అత్యధిక పరుగులు చేశాడు. ఉమ్రాన్ మాలిక్ 7 వికెట్లు తీసుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. ఓవరాల్‌గా 117 పరుగులు, 3 వికెట్లు తీసుకున్నాడు.

శ్రీలంకతో 29 టీ20లు ఆడిన భారత్.. 19 మ్యాచుల్లో విజయం సాధించి ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. పాక్‌పై ఇంగ్లాండ్ కూడా 29 మ్యాచుల్లో 19 గెలిచింది.

స్కోర్లు: భారత్: 228/5(20), శ్రీలంక: 137/10 (20) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: సూర్యకుమార్ యాదవ్