YouSay Short News App

INDvsSL:తొలి టీ20లో టీమిండియాదే విజయం

శ్రీలంకతో తొలి టీ20లో టీమిండియా అదరగొట్టింది. రెండు పరుగుల తేడాతో గెలుపొంది 3 మ్యాచుల సిరీస్‌లో శుభారంభం చేసింది.

విజయం కోసం ఇరు జట్లు చివరి ఓవర్ వరకు పోరాడాల్సి వచ్చింది. మిడిల్ ఓవర్స్‌లో విజయ సమీకరణం ఇరు జట్ల మధ్య దోబూచులాడింది.

10ఓవర్ల తర్వాత శ్రీలంక బ్యాట్స్‌మన్ చెలరేగి ఆడారు. ముఖ్యంగా కెప్టెన్ దసున్ శనక 27 బంతుల్లోనే 45 పరుగులు చేసి భారత బౌలర్లకు వణుకు పుట్టించాడు. కరుణరత్నె 23* పోరాడాడు.

అరంగేట్ర మ్యాచులో శివమ్ మావి 4 వికెట్లతో అదరగొట్టాడు. 4 ఓవర్లు వేసి కేవలం 22 పరుగులు ఇచ్చాడు. కీలక సమయంలో వికెట్లు పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

టాస్ ఓడి బ్యాటింగుకి దిగిన టీమిండియా ఇన్నింగ్సుని ఘనంగా ఆరంభించింది. ఘనంగా ముగించింది. ఇషాన్ కిషన్(37), కెప్టెన్ హార్దిక్ పాండ్యా(29) గౌరవప్రదమైన స్కోరు చేశారు.

టీమిండియా ఇన్నింగ్సులో దీపక్ హుడా(41*), అక్షర్ పటేల్(31*) భాగస్వామ్యమే కీలకం. వీరిద్దరూ కలిసి 35బంతుల్లో 68 పరుగులు చేశారు. చివరి వరకు నిలిచి టీమిండియాకు మెరుగైన స్కోరును అందిచారు.

అరంగేట్ర మ్యాచులో శుభ్‌మన్ గిల్(7) పెద్దగా ఆకట్టుకోలేదు. మరోవైపు అవకాశాల కోసం ఎదురు చూస్తున్న సంజు శాంసన్(7) కూడా విఫలమయ్యాడు. అంచనాలు పెట్టుకున్న సూర్యకుమార్ యాదవ్(5) నిరాశ పరిచాడు.

మ్యాచ్‌ చివరి ఓవర్‌లో లంక విజయానికి 11 పరుగులు కావాల్సిన వేళ అక్షర్ పటేల్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకుని భారత్‌కు 2 పరుగులతో విజయాన్ని అందించాడు.

స్కోర్లు : భారత్ 162/5(20); శ్రీలంక 160/10(20) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: దీపక్ హుడా