అంబానీ కోడలు పిల్ల... అందాల ముద్దుగుమ్మ ‘రాధికా’

YouSay Short News App

అపర కుబేరులు ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్‌కు, మర్చంట్ వారుసురాలైన రాధికా మర్చంట్‌తో నిశ్చితార్థం అయ్యింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆమె గురించే చర్చ.

ఇప్పటికే భరతనాట్యంతో మెప్పించిన  ఈ అంబానీ కోడలు వ్యాపారాల్లోనూ అంతే చురుగ్గా ఉంటుంది. రాధికా మర్చంట్‌ గురించి కొన్ని విషయాలు తెలుసుకోండి.

రాధికా సిరిగల కుటుంబంలో పుట్టినప్పటికీ వ్యక్తిగతంగా చాలా సింపుల్‌గా ఉంటుంది. దాదాపు అన్ని చోట్ల సంప్రదాయబద్ధంగా కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తుంది.

సంప్రదాయానికే మెుగ్గు

ఓ ఎన్జీవోతో కలిసి రాధిక పనిచేస్తోంది.తండ్రి ఆరోగ్య సంస్థ వేదికగా సేవాకార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు తోచినంత సాయపడుతున్నారు.

సదా మీసేవలో

ట్రెక్కింగ్, స్విమ్మింగ్‌ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఇందులో దొరికినంత ఆనందం ఎక్కడా దొరకదని చెబుతుంది రాధిక

ఇష్టాలు

రాధిక మెుదట్నుంచే కాఫీ లవర్ అంట. ఎక్కడికెళ్లినా సరే కాఫీతోనే రిలాక్స్ అవుతానని చెబుతోంది.

కాఫీ లవర్

సమాజానికి ఉపయోగపడే పని చేస్తానంటోంది రాధిక. అప్పుడే ఆత్మ సంతృప్తి దొరుకుతుందని ఆమె నమ్మకం.

సంతృప్తినిచ్చే పని

అంబానీ కుటుంబానికి కాబోయే ఈ కోడలు ఫ్యాషన్‌ ప్రియురాలు. ఆమె ఎప్పటికప్పుడూ ట్రెండ్‌ను ఫాలో అవుతుంది. రాధిక డ్రెస్సింగ్‌ చూస్తే సులభంగా చెప్పేయవచ్చు.

ఫ్యాషన్ ప్రియురాలు

ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ పైనా రాధిక దృష్టిసారిస్తుంది. రోజువారీ రొటీన్‌ వ్యాయామాలు తప్పనిసరిగా చేస్తుందట.

ఫిట్‌నెస్‌ ముఖ్యమే

రాధిక మర్చంట్ భరతనాట్యంలో నిష్ణాతురాలు. ఇప్పటికే ఎన్నో పర్‌ఫార్మెన్సెస్‌ ఇచ్చి ఆకట్టుకుంది.

భరతనాట్యం