YouSay Short News App

IPL 2023: సీజన్ ప్రారంభానికి ముందే కీలక ఆటగాళ్లు దూరం…అవకాశం దక్కేది ఎవరికో?

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)కి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ఇలాంటి తరుణంలో కీలకమైన ఆటగాళ్లు గాయాలతో దూరం అవుతున్నారు.

ప్రస్తుతమున్న జట్లలో కొంతమంది ఇప్పటికే సీజన్‌ నుంచి ఔట్ అవ్వగా.. మరికొందరు ఆడటంపై అనుమానాలు ఉన్నాయి.

ముంబయికి ఈ సారి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జస్ప్రిత్ బుమ్రా గాయంతో IPL ఆడటం లేదు.స్థానంలో ధవల్ కులకర్ణి, బేసిల్ థంపీ, సందీప్ శర్మకి అవకాశం దక్కవచ్చు.

ముంబయికి ఎదురుదెబ్బ

ముంబైకి చెందిన మరో కీలకమైన బౌలర్  జో రిచర్డ్‌సన్‌ కూడా ఐపీఎల్‌ నుంచి ఔట్ అయ్యాడు. కోటిన్నరకు అతడిని కొనుగోలు చేసింది.

వెన్ను నొప్పి కారణంగా సీజన్‌కు దూరమయ్యాడు కైలీ జేమిసన్‌ను . అతడి స్థానాన్ని దసున్ శనకతో భర్తీ చేయాలని ప్లాన్ చేస్తోంది చెన్నై.

చెన్నైకి షాక్‌

రాజస్థాన్ రాయల్స్‌లో మేటి బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ. వెన్ను గాయం కారణంగా ఐపీఎల్‌ ఆడటం లేదు. ప్రసిద్ధ్‌ను రూ. 10 కోట్లకు RR ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. అతడి స్థానంలో వరుణ్ అరోణ్‌కు అవకాశం కల్పించవచ్చు.

రాయల్స్‌కు కష్టమే

దిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. దీంతో ఎవరు సారథ్యం వహిస్తారనే అంశంపై చర్చ సాగుతోంది.

దిల్లీ సారథి ఎవరో?

మరోవైపు అతడి స్థానంలో వికెట్ కీపర్‌గా షెల్డన్ జాక్సన్‌, లవనీత్ సిసోడియాకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.

ఇటీవల దేశవాలీ క్రికెట్‌లో సూపర్‌ ఫామ్‌తో మెరిసిన సర్ఫరాజ్ కూడా గాయపడటంతో ఐపీఎల్ ఆడటం అనుమానమే. ఫలితంగా మరో బ్యాట్స్‌మెన్‌ను దిల్లీ కోల్పోయింది.

పంజాబ్‌ సూపర్ బ్యాట్స్‌మెన్‌ జానీ బెయిర్‌స్టో ఆడటంపై నీలినడలు కమ్ముకున్నాయి. అతడికి ఇంగ్లాండ్ క్రికెట్‌ బోర్డు NOC ఇవ్వలేదు. ఒకవేళ అతడు రాకపోతే  జాసన్‌ రాయ్‌ను ఎంపిక చేస్తారు.

పంజాబ్ పరిస్థితి

కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్‌ ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరం కావచ్చు. అతడి స్థానంలో ఆండ్రూ రస్సేల్‌కు బాధ్యతలు కట్టబెడతారని ప్రచారం జరుగుతోంది.

కోల్‌కతాకు కటకట