2023 ఐపీఎల్ సీజన్ కోసం జరిగిన మినీ వేలం పూర్తయింది. ఆయా జట్లు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. మినీ వేలమే అయినా ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఆటగాడి కోసం అత్యంత భారీగా వెచ్చించడం విశేషం.
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్‌ని రూ.18.5కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది రికార్డు. ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ని 17.5 కోట్లకు ముంబై చేజిక్కించుంది.
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌కి రూ.16.5కోట్లు పెట్టి చెన్నై తీసుకుంది. నికోలస్ పూరన్‌కి రూ.16కోట్లు వెచ్చించి లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది. హ్యారీ బ్రూక్‌ని రూ.13.25 కోట్లు, మయంక్ అగర్వాల్‌ని రూ.8.25కోట్లకు సన్‌రైజర్స్ చేజిక్కించుకుంది.
లీగ్‌లో అత్యంత పెద్ద వయస్కుడైన అమిత్ మిశ్రాను రూ. 50లక్షలకు లక్నో సూపర్ జెయింట్స్ తీసుకుంది. వేలానికి దరఖాస్తు చేసుకుని అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచిన అఫ్గాన్ స్పిన్ బౌలర్ మహ్మద్ గజన్‌ఫర్‌కి నిరాశే ఎదురైంది.