IPL: దూకుడు మీదున్న సన్ రైజర్స్ ప్లేయర్స్… ఈ సారి ట్రోఫీ పక్కా!
ఐపీఎల్ 2023 ప్రారంభం కాకముందే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోని ఆటగాళ్ల గురించి తెగ చర్చ జరుగుతోంది. ఇందుకు కారణం అందులోని చాలామంది బీభత్సమైన ఫామ్‌లో ఉండటమే.
ఆటగాళ్ల కూర్పు చూస్తే ఈసారి ఫినాలే రేస్‌లో SRH కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు. అందుకు తగినట్లుగానే అంతర్జాతీయ క్రికెట్‌లో వాళ్లు రాణిస్తుండటం కలిసొచ్చే అంశం.
SRH జట్టుకి మెుదటి జాక్‌పాట్ కెప్టెన్ మార్క్రమ్ సూపర్ ఫామ్‌లో ఉండటం. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టీ20లకు కెప్టెన్ అయ్యాడు. ఇటీవల SA 20 లీగ్‌లో సన్‌రైజర్స్‌కు కప్పును కూడా అందించాడు.
మార్క్రమ్
వేలంలో రూ.13.25 కోట్లు పెట్టి ఇంగ్లాండ్ ప్లేయర్ బ్రూక్‌ను కొన్నప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అతడి రికార్డులు చూసి నోరు తెరవాల్సి వస్తోంది. సూపర్ ఫామ్‌తో చెలరేగుతున్న హ్యారీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో ఉన్నాడు.
హ్యారీ బ్రూక్
రషీద్ ఖాన్ లేని లోటు గతేడాది స్పష్టంగా కనబడింది. అతడిని భర్తీ చేసేందుకు ఆదిల్ రషీద్‌ను తీసుకున్నారు. ఇటీవల బంగ్లాదేశ్ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు ఆదిల్.
ఆదిల్ రషీద్
సన్ రైజర్స్‌లో ప్రస్తుతమున్న సాలిడ్ ఆల్‌రౌండర్. అలవోకగా బంతిని బౌండరీ దాటించే ఫిలిప్స్ టీ20 ప్రపంచకప్ నుంచి సూపర్ ఫామ్‌తో చెలరేగుతున్నాడు. ఐపీఎల్‌లోనూ కొనసాగే అవకాశం ఉంది.
గ్లెన్ ఫిలిప్స్
గతేడాది యాన్సన్ బౌలింగ్‌లో రషీద్ ఖాన్ మూడు సిక్సులు కొట్టడం అందరికీ గుర్తిండిపోయింది. సరిగ్గా ఇలాంటి సీన్ ఇటీవల SA లీగ్‌లో జరిగింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సిక్సులు బాది రివేంజ్ తీసుకున్నాడు యాన్సన్.
మార్కో యాన్సన్
సౌతాఫ్రికాకు చెందిన క్లాసెన్ ప్రపంచకప్‌కు ముందు టీమిండియాతో జరిగిన సిరీస్‌నుంచే ఫామ్ కొనసాగిస్తున్నాడు. SA లీగ్‌లో ఏకంగా రెండు సెంచరీలు బాదాడు. అవి కూడా 43 బంతుల్లో ఒకటి, 44 బంతుల్లో మరొకటి.
హెన్రిచ్ క్లాసెన్
రాహుల్ త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడే ఈ యంగ్ క్రికెటర్ జనవరిలో శ్రీలంక సిరీస్‌లో తనదైన ఆటతో ప్రశంసలు అందుకున్నాడు.
రాహుల్ త్రిపాఠి
SRH బౌలింగ్ విభాగంలో ఉమ్రాన్ మాలిక్ కచ్చితంగా జట్టులో ఉంటాడు. దాదాపు అన్ని సిరీసుల్లోనూ రాణించాడు స్పీడ్‌గన్. ఐపీఎల్‌లో మరోసారి సత్తా చాటేందుకు రెఢీ అయ్యాడు.
ఉమ్రాన్ మాలిక్
మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.