భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఫైనల్ మ్యాచ్ చూడాలని కోట్లాది మంది అభిమానులు పడ్డ ఆశ అడియాసైపోయింది. ఇండియాకు షాక్ ఇస్తూ ఇంగ్లాండ్ ఫైనల్‌కి చేరుకుంది.
ఓడిన భారత్..
ఇండియా ఓటమి బాధలో ఉంటే, మరోవైపు పాక్ సంబరాలు చేసుకుంటోంది. ఈ సంబరాల వెనక కొన్ని కారణాలున్నాయి. అవేంటో చూద్దాం.
పాక్ సంబరాలు
పాక్, ఇండియా మధ్య మ్యాచ్ అంటే ఒత్తిడితో కూడుకున్నది. మైదానంలో ఆటగాళ్లు, బయట కోట్లాది మంది అభిమానులకు ఈ భావోద్వేగం ఉంటుంది. రెండు దేశాలే కాక, క్రికెట్ ప్రపంచం మొత్తం ఇటువైపు చూస్తుంది.
పాక్‌కు ఒత్తిడి తగ్గె..
సాధారణంగా ఇండియాతో మ్యాచ్ అంటే పాక్ ఆత్మరక్షణలో పడిపోతుంటుంది. ఇండియాపై ఆధిపత్యం చెలాయించలేమన్న రక్షణాత్మక ధోరణిలో పాక్ ఉంటుంది. పైగా గ్రూప్ దశలో ఓడిపోవడం పాక్‌కి ఈ భయాన్ని మరింత పెంచింది.
ఆత్మరక్షణలో పాక్...
సెమీఫైనల్ మ్యాచులు పూర్తికాక ముందే అందరూ భారత్, పాక్ ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుకున్నారు. కానీ, అంతా తలకిందులు కావడంతో పాక్‌కి ఊపిరి పీల్చినట్లయింది. భారత్ కన్నా ఇంగ్లాండును ఎదుర్కోవడం పాకిస్థాన్‌కి కాస్త సులువే.
ఊహాగానాలు..
1992 ప్రపంచకప్‌లో జరిగినట్లే ఇప్పుడూ జరగుతుండటంతో రెట్టించిన ఉత్సాహంతో పాకిస్థాన్ ఫైనల్ ఆడబోతోంది. నాడు ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ని పాక్ సొంతం చేసుకుంది. అదీ ఇంగ్లాండుపై విజయం సాధించి ట్రోఫీ అందుకుంది.
నాడు విజేతగా..
ఈ వరల్డ్‌కప్ కూడా అలాగే జరగబోతోందని పాక్ అభిమానులు ఆశిస్తున్నారు. సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌ని ఓడించడం కూడా యాదృచ్ఛికంగా పాక్‌కి కలిసొచ్చింది. ఈ సారూప్యతలు పాక్‌కి మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తున్నాయి.
అలాగే జరుగుతోందే..
ప్రస్తుత ప్రపంచకప్ ఫైనల్ వేదిక మెల్‌బోర్న్. 1992లోనూ ఇదే వేదికపై ఇంగ్లాండుపై పాకిస్థాన్ ఫైనల్ ఆడి గెలిచింది. 22 పరుగుల తేడాతో ఇంగ్లాండుపై పైచేయి సాధించింది. ఇప్పుడు కూడా ఇదే రిపీట్ కాబోతోందని అంచనా వేస్తోంది.
అదే వేదిక..
పైగా, పాక్ ఆటగాళ్ల ప్రదర్శన అత్యుత్తమంగా ఉంది. బౌలర్లు, బ్యాట్స్‌మన్‌లు ఫామ్‌లో ఉన్నారు. అదృష్టం కన్నా కష్టాన్నే పాక్ ఎక్కువగా నమ్ముకుంటోంది. బాబర్, రిజ్వాన్ ఫామ్‌లోకి రావడం వారికి అదనపు బలం.
ఫామ్‌లో పాక్..
ఇంగ్లాండుకి కూడా కొన్ని సానుకూలతలు ఉన్నాయి. టీ20ల్లో పాక్‌పై ఇంగ్లాండ్ అత్యధికంగా 17సార్లు పైచేయి సాధించింది. ప్రపంచకప్‌లోనూ ఇంగ్లాండుదే పైచేయి.
ఇంగ్లాండ్ ఇక్కడ..
ఇంగ్లాండుకు మెరుగైన రికార్డే ఉన్నప్పటికీ మానసికంగా పాక్ ఆటగాళ్లు ఒత్తిడికి లోనుకారు. ఇండియాతో అయితే అంత స్వేచ్ఛగా ఆడేందుకు వీలు కాదు. ఇదే పాకిస్థాన్‌కి ఇప్పుడు ప్లస్ పాయింట్‌గా మారింది.