హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న అల్లరి నరేశ్ ‘నాంది’ సినిమా నుంచి తన పంథా మార్చారు. వైవిధ్యమైన కథలతో ముందుకు వెళుతున్నారు.
‘ నాంది’ తర్వాత ఆ తరహాలోనే ‘ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో మరోసారి ప్రేక్షకులను పలకరించారు. మరి సినిమా ఎలా ఉంది. నరేశ్ ప్రేక్షకులను మెప్పించాడా లేదా ? తెలుసుకోండి.
మారేడుమిల్లి గ్రామంలో ఎన్నికలు నిర్వహించడానికి శ్రీపాద శ్రీనివాస్ (నరేశ్ ) ఉపాధ్యాయుడిగా వెళతాడు. నరేశ్ అక్కడకు వెళ్లిన తర్వాత ఏం జరిగింది ? గ్రామంలో పేరుకుపోయిన ఒక్కో సమస్యలు నరేశ్‌ను ఎలా కదిలించాయి. హీరో వాటిని ఒక్కొక్కటిగా ఎలా పరిష్కరించాడనేది కథ.
కథ
గిరిజన ప్రాంతాల్లో సమస్యలను చూపిస్తూ దర్శకుడు కథను పరిచయం చేశాడు. తండా వాసులు హక్కులను కోల్పోతున్నారని ఎమోషనల్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. గ్రామస్థులకు న్యాయం చేయడానికి నరేశ్ చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి.
ఎలా ఉందంటే?
సినిమా మెుత్తం నరేశ్ పాత్ర పూర్తిగా సీరియస్‌గా సాగినప్పటికీ ఫస్టాఫ్‌లో వెన్నెల కిషోర్ కామెడీ కాసేపు నవ్వులు పూయిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ సహా కొన్ని సన్నివేశాలు సినిమాలో ఆద్యంతం ఆసక్తి రేకిత్తిస్తాయి.
కథ పాతదే అయినప్పటికీ కథనం బాగుంటే సినిమా నిలబడుతుంది. కానీ, ఇందులో స్రీన్ ప్లే కొత్తదనం లేదనిపిస్తుంది. ఏం జరగబోతుందో ప్రేక్షకులు ముందే ఊహిస్తారు. కొందరికి ‘NEWTON’ సినిమా రీమేక్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ స్లోగా సాగుతుంది. కానీ, అబ్బూరి రవి తన మార్క్ డైలాగ్‌లతో ఆకట్టుకున్నారు.
కథనం
కామెడీ పాత్రలే కాదు సీరియస్ రోల్స్‌లోనూ నటించగలనని ఈ సినిమాతో నరేశ్ మరోసారి నిరూపించాడు. తన పాత్ర ఎంతవరకు కావాలో పరిధిమేరకు నటించాడు. నరేశ్ నటన ప్రేక్షకులను అభిమానులను మెప్పిస్తుంది.
ఎవరెలా చేశారు
హీరోయిన్ ఆనంది క్యారెక్టర్ గత సినిమాలతో పోలిస్తే కాస్త బాగుంటుంది. ఇందులో తన పరిధిమేరకు నటించింది. వెన్నెల కిషోర్, సంపత్ తమ పాత్రల మేరకు నటించారు.
సినిమా నేపథ్యం అల్లరి నరేష్ నటన బాగున్నప్పటికీ ఇందులో కావాల్సిన ఎమోషన్ మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. కొన్ని సన్నివేశాలు లాజిక్ కు దూరంగా ఉండటంతో కాస్త నిరాశపరుస్తుంది.