బాలీవుడ్‌ భామ జాన్వీ కపూర్‌ మరోమారు చిట్టి పొట్టి డ్రెస్‌లో తళుక్కుమంది.

గ్లామర్‌ ఫోజుల్లో కనిపించి అందాల జాతర చేసింది. కొంటెగా చూస్తూ కవ్వించింది.

ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు దేవకన్యలా ఉన్నావ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

హిందీలో జాన్వీ వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ చెప్పుకోతగ్గ బ్రేక్ రాలేదు.

దీంతో దక్షిణాదిలో తన ‌అదృష్టాన్ని పరీక్షించుకోవాలని జాన్వీ చూస్తోంది.

ప్రస్తుతం జూ.ఎన్టీఆర్‌తో కలిసి దేవర సినిమాలో ఈ బ్యూటీ నటిస్తోంది.

మరోవైపు కోలీవుడ్‌లో కూడా ఈ భామకు అవకాశాలు తలుపు తడుతున్నాయి.

శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి వచ్చిన జాన్వీ.. ‘ధడక్‌’ మూవీతో ప్రేక్షకులకు పరిచయమైంది.

ఆ సినిమాలో జాన్వీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అటు అవకాశాలు సైతం క్యూ కట్టాయి.

రీసెంట్‌గా ‘మిలి’ సినిమాతో జాన్వీ ఆడియన్స్‌ పలకరించింది. అయితే ఈ మూవీ ఫ్లాప్‌గా నిలిచింది.

ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే సోషల్‌ మీడియాలోనూ జాన్వీ యమా యాక్టివ్‌గా ఉంటోంది.

తన ఫొటో షూట్‌, విహార యాత్రలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తోంది.

ప్రస్తుతం జాన్వీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను 21.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.