YouSay Short News App

Jawan: షారూక్‌ మూవీకి అల్లు అర్జున్ అందుకే నో చెప్పాడా?

షారూక్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ గాసిప్ మొన్నటివరకూ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

జవాన్ సినిమాలో షారూక్‌కి సోదరుడిగా ఐకాన్ స్టార్ నటించనున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే, ఈ సినిమా అల్లు అర్జున్ చేయట్లేదని తెలుస్తోంది.

‘జవాన్’ మూవీలో బన్నీ పవర్‌ఫుల్ ఆర్మీ అధికారి పాత్ర పోషించనున్నాడని, 15నిమిషాల నిడివితో బన్నీ పాత్రను డిజైన్ చేశారని టాక్ వచ్చింది.

‘జవాన్’ డైరెక్టర్ అట్లీ ఐకాన్ స్టార్‌కి కథ వినిపించారట. అయితే, పుష్ప2 కోసం ఈ ఆఫర్‌ని అల్లు అర్జున్ తిరస్కరించినట్లు సమాచారం.

ప్రస్తుతం ‘పుష్ప2’ షూటింగ్‌లో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఇంకా రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకోవాల్సి ఉంది.

కాల్‌షీట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే షారూక్ ‘జవాన్’ మూవీకి ఐకాన్ నో చెప్పినట్లు తెలుస్తోంది. పాత్ర నచ్చినప్పటికీ పుష్ప సినిమా కోసం త్యాగం చేసేసినట్లు టాక్.

అయితే, ‘జవాన్’లో తమిళ హీరో విజయ్ నటిస్తున్నాడని ప్రచారం జరిగింది. అట్లీ పుట్టినరోజుకు షారూక్, విజయ్ కలిసి దిగిన ఫొటో ఇందుకు ఊతమిచ్చింది.

‘జవాన్’లో కేమియో రోల్ కోసం విజయ్‌ని సంప్రదించారని టాక్. మరి బన్నీ రిజెక్ట్ చేయడంతో ఈ పాత్ర కోసం విజయ్‌ని మళ్ళీ సంప్రదిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే ‘జవాన్’ సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. దీపిక పదుకొణె, నయనతార, ప్రియమణి కీలక పాత్ర పోషిస్తున్నారు.

హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ‘జవాన్’ విడుదల కానుంది. అనిరుధ్ రవిచందర్ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

2023 జూన్ 2న ‘జవాన్’ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

తాజాగా ఇన్‌స్టాగ్రాంలో అల్లు అర్జున్‌ 20మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. పుష్ప సినిమాకి ముందు 14మిలియన్‌లు ఉండగా,  ఈ సినిమా మేనియాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.

మరిన్ని వెబ్‌స్టోరీస్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండి