JOHN WICK: సినిమా అంతా బ్లడ్ అండ్ వార్… కానీ జీవిత పాఠాలెన్నో..!

YouSay Short News App

పుస్తకాలు, రచనల నుంచే కాదు సినిమాల్లో నుంచి కూడా చాలా నేర్చుకుంటాం. హీరో చెప్పే మాటలు కావచ్చు లేదా చిత్రంలో వచ్చే సన్నివేశం అయ్యి ఉండొచ్చు కొన్ని సార్లు కదిలిస్తుంది.

హాలీవుడ్‌ ఫ్రాంఛైజీ జాన్‌ విక్‌ ఇందులో ఒకటి. సినిమా మెుత్తం గన్స్‌, బుల్లెట్స్‌తో నిండిపోయినా.. జీవితంలో కొన్ని స్ఫూర్తినిచ్చే విషయాలను నేర్పిస్తుంది.

ఇప్పుడు ఇదంతా ఎందుకని అనుకుంటున్నారా? జాన్ విక్ నుంచి నాలుగో పార్ట్ రాబోతుంది. మార్చి 24న విడుదలకు సిద్ధమయ్యింది.

2014 నుంచి 19 వరకు తెరకెక్కించిన మూడు పార్ట్‌లు కూడా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సాధించాయి. ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి.

లక్ష్యం

మనం ఏదైనా పనిచేయాలనుకున్నపుడు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. అప్పుడే మనం నడవాల్సిన మార్గంపై క్లారిటీ వస్తుంది. జాన్‌ విక్‌ నుంచి ఇది నేర్చుకోవచ్చు.

నిబద్ధత

జాన్‌ విక్‌ అంటే నిబద్ధతకు పెట్టింది పేరు. అతడు ఏ పని చేసినా పూర్తి నిబద్ధతతో చేస్తాడు.

కఠోర శ్రమ

లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నపుడు దారిలో రాళ్లు, ముళ్లూ ఎన్ని ఉన్నా దాటుకుని వెళ్లాల్సిందే. జాన్‌ తన లక్ష్యం కోసం ప్రాణాలు లెక్కచేయడు. విశ్రమించడు. నిరంతరం దానికోసం పోరాడుతూనే ఉంటాడు.

అసలేంటిది?

నేరాలు చేసే ఓ వ్యక్తి అన్ని వదిలేసి సాధారణమైన జీవితం గడుపుతుంటాడు. తన భార్య చనిపోయే ముందు ఇచ్చిన కుక్కను చంపినందుకు ఎంతమందిని చంపుతాడనే కథ.

హీరో పాత్ర నుంచి చంపడం నేర్చుకోమని చెప్పట్లేదు గానీ జాన్‌విక్‌ క్యారెక్టరైజేషన్‌లోనే కొన్ని జీవిత పాఠాలుంటాయి అవేంటో చూద్దాం.

నమ్మకం

సినిమాలో ముఖ్యంగా ఇచ్చే సందేశం “మీపై మీకు నమ్మకం ఉండాలి. నువ్వు నమ్మిన దానిపైనే నిలబడాలి”. జాన్‌విక్‌ తాను నమ్మిన దాని కోసం పోరాడతాడు ఎంతకైనా తెగిస్తాడు. వెనుకడుగు వేయడు.

మన పని

చేసే ప్రతి పని మనది అనుకుంటేనే అత్యుత్తమంగా ప్రయత్నిస్తాం. మధ్యలో ఎన్నో అడ్డంకులు రావచ్చు. వాటిని విడిచిపెట్టి ముందుకెళ్లాలి. జాన్‌విక్ ఏపనినైనా తనది అన్నట్లుగా పూర్తి చేస్తాడు.

తక్కువగా మాట్లాడు

సినిమాలో హీరో చాలా తక్కువగా మాట్లాడతాడు. నీ వద్ద చెప్పాలనుకునే విషయం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. అప్పుడే ఆ మాటలకు అర్థం ఉంటుందనే విషయాన్ని గమనించవచ్చు.

ప్లాన్ బి

చాలా పనులకు కచ్చితంగా రెండు ప్రణాళికలు ఉండాలి. అప్పుడే ఒకటి ఫెయిల్ అయినా మరొకటి ఉపయోగపడుతుంది. హీరో ఓ గ్యాంగ్‌స్టర్ అంటే కచ్చితంగా ఎత్తుకి పైఎత్తులు ఉంటాయి కదా.

కుదరదు

ఏదైనా నచ్చని విషయానికి నో చెప్పడానికి సంకోచించవద్దు. నో చెప్పడం అలవాటైతే ఎన్నో దురలవాట్లు, దురాలోచలకు దూరంగా ఉండొచ్చు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran