Joshimath Sinking: కొంతకాలం తర్వాత  జోషిమఠ్ పట్టణం కనిపించదా..?

YouSay Short News App

గేట్ వే ఆఫ్ బద్రీనాథ్‌‌గా పేరుగాంచిన జోషిమఠ్ పట్టణం ప్రస్తుతం ప్రమాదపుటంచుల్లో ఉంది. క్రమక్రమంగా ఈ నగరం కుంగిపోతుండటం భయాందోళనకు గురిచేస్తోంది.

బద్రీనాథ్‌కు సమీపంలో..

గేట్ వే ఆఫ్ బద్రీనాథ్‌‌గా పేరుగాంచిన జోషిమఠ్ పట్టణం ప్రస్తుతం ప్రమాదపుటంచుల్లో ఉంది. క్రమక్రమంగా ఈ నగరం కుంగిపోతుండటం భయాందోళనకు గురిచేస్తోంది.

ఏం జరుగుతోంది..?

గత కొన్ని రోజులుగా అక్కడ రోడ్లు, ఇళ్లు బీటలు వారాయి. భవనాల గోడలకు పగుళ్లు ఏర్పడ్డాయి. భూమి నుంచి నీరు ఉబికి వస్తోంది. దీంతో ప్రజలు అయోమయ స్థితిలో పడిపోయారు.

ఇవే కారణమా..

ఎన్టీపీసీ హైడ్రో పవర్ ప్రాజెక్టు, బద్రీనాథ్ హైవే నిర్మాణం, తదితర భారీ కట్టడాల వల్లే ఇలా అయ్యి ఉంటుందని పలువురి వాదన.

అక్కడ భూ స్వరూపం అస్థిరంగా ఉండటం,  విచ్చలవిడిగా నిర్మాణాలు చేపట్టడమూ ఇందుకు కారణమని నిపుణుల మాట.

ముందే హెచ్చరికలు..

దాదాపు 4 శతాబ్దాల క్రితమే ఇక్కడ నిర్మాణాలు చేపట్టే విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలని నిపుణుల కమిటీ సూచించింది. భారీ బండరాళ్లను శిథిలం చేయొద్దని, చెట్లను జాగ్రత్తగా పెంచాలని తెలిపింది.

సర్వేలో..

1976లో మిశ్రా కమిటీ చేసిన సూచనలను పెడచెవిన పెడుతూ నిర్మాణాలు కొనసాగాయి. దీంతో భూ ఉపరితలం పట్టు కోల్పోయి క్రమంగా కుంగడం మొదలైందని నిపుణులు చెబుతున్నారు.

గతేడాది ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిపిన సర్వేలోనూ  ఇదే విషయాన్ని వెల్లడించారు.

నిరుపయోగంగా ఇళ్లు

దాదాపు 600కు పైగా ఇళ్లు ఇలా బీటలు వారాయి. ఇవి నివాసయోగ్యంగా లేకపోవడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

సురక్షితం కావు..

జిల్లా విపత్తు స్పందన అధికారులు 200 ఇళ్లను నివసించడానికి సురక్షితం కానివిగా గుర్తించారు. వాటి గోడలపై ఇలాంటి ఇళ్లకు రెడ్ క్రాస్ గుర్తుతో పెయింట్ వేస్తున్నారు.

25వేల మందికి ముప్పు

జోషిమఠ్ పట్టణం కుంగిపోతుండటం వల్ల దాదాపు 25వేల మంది ప్రజల అస్థిత్వం ప్రశ్నార్థకంగా మారింది. వీరంతా బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. మరికొంత మంది వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.

ప్రభుత్వాల ప్రత్యేక దృష్టి

పరిస్థితి రోజురోజుకు తీవ్రమవుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

క్షేత్రస్థాయిలో పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రజల ప్రాణాలే ప్రథమ ప్రాధాన్యంగా ముందుకు సాగాలని ప్రధాని ఆదేశించారు.

రూ.4వేల సాయం

సీఎం పుష్కర్ సింగ్ ధామి స్వయంగా పర్యటించి స్థానికులకు ధైర్యం చెప్పారు. మరో 6 నెలల పాటు ప్రతి కుటుంబానికి నెలకు రూ.4వేల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ప్రకటించారు.

తాత్కాలిక శిబిరాలు

జోషిమఠ్ పరిసర ప్రాంతమైన పిపల్‌కోఠి గ్రామంలో తాత్కాలికంగా శిబిరాలను నిర్మిస్తున్నారు. జోషిమఠ్ శరణార్థుల కోసం సుమారు 16 గూడారాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.

జాతీయ విపత్తుగా..

జోషిమఠ్ కుంగిపోతున్న ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ఇందుకు వంత పాడుతున్నాయి.

మరో ద్వారక కాబోతోందా?

ఈ పరిణామాలతో జోషిమఠ్ పట్టణం మరో ద్వారకలా భూగర్భంలో కలిసిపోనుందంటూ చర్చ ప్రారంభమైంది.

పరిస్థితి తీవ్రతను బట్టి చూస్తే ఈ భావన కలుగుతుందంటూ పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.