గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ఎన్టీఆర్….   గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఫిదా  అయిన వెస్ట్రన్ మీడియా

YouSay Short News App

యంగ్ టైగర్  ఎన్టీఆర్ … ఇప్పుడు ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగుతోంది. తాజాగా జరిగిన  గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ఫంక్షన్‌లో తారక్ సెంటర్‌ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు.

తన ఇంగ్లీష్ స్లాంగ్‌తో కట్టిపడేశాడు. తన వేషధారణ, స్టైల్, లుక్స్ అన్నింటికీ మించి NTRలోని హ్యూమర్‌ను చూసి.. వెస్ట్రన్ మీడియా ఫిదా అయిపోయింది. గ్లోబల్ స్టార్‌గాా గుర్తింపునిచ్చింది.

గోల్డెన్ గ్లోబ్ అవార్స్‌ ఫంక్షన్‌లో తనకుంటూ యూనిక్ స్టైల్ క్రియేట్ చేసుకున్న తారక్ వేషధారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో మెరిసిన తారక్

ఏ హాలీవుడ్ స్టార్‌కు తగ్గని విధంగా ఫంక్షన్‌లో ఎన్టీఆర్ మెస్మరైజ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. బ్లాక్ టక్స్‌ ధరించి హలీవుడ్ సూపర్ స్టార్‌లా ఎంట్రీ ఇచ్చాడు.

డ్రెస్సింగ్ స్టైల్

బ్లాక్ టక్స్‌తో పాటు యాసిడ్ క్లౌడ బ్రాండ్‌కు చెందిన హుడీ  ధరించి స్టైలీష్‌గా కనిపించాడు. దీని ధర రూ. 19,500

అమెరికాలో నిర్వహించిన ఫ్యాన్స్ మీట్‌లోనూ ఎన్టీఆర్  టాక్ ఆఫ్‌ ది టౌన్‌గా నిలిచాడు. తారక్ వేసుకున్న షూస్‌పై క్రేజీ బజ్ ఏర్పడింది . వీటిపై ఆరా తీయగా  'గోల్డెన్ గూస్' బ్రాండ్ షూస్ తారక్ ధరించినట్లు తెలిసింది. ఈ షూస్ ధర ఏకంగా రూ.91,917.

మరోవైపు తారక్ ధరించిన సన్‌గ్లాసెస్‌ కూడా బాగా ట్రెండ్ అయ్యాయి. వీటిపై నెటిజన్లు వెతకగా SPR19W సన్‌గ్లాస్‌గా గుర్తించారు. వీటి ధర రూ.45,200.

స్టైలీష్ లుక్స్

ఎప్పుడూ స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడే తారక్…. తొలిసారి అమెరికా ఇంగ్లీష్ స్లాంగ్‌లో అదరగొట్టాడు. మీడియా ప్రశ్నలకు వినసొంపుగా సమాధానాలు చెప్పాడు.

యాక్సెంట్ అదుర్స్

ఎన్టీఆర్ మాటలకు వెస్ట్రన్ మీడియా ముచ్చటపడింది.  తారక్ స్లాంగ్‌పై ఇక్కడ ట్రోల్స్ వచ్చినా... NTR  ఫ్యాన్స్ వాటిని అదే స్థాయిలో తిప్పికొట్టారు.

గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో అత్యంత ఆకర్షించిన టాప్-5 జాబితాలో తారక్ అగ్రస్థానంలో నిలిచాడు.

టాప్-5లో నంబర్ 1

ఈ జాబితాలో హాలీవుడ్ స్టార్ టైలర్ జెమ్స్ విలియమ్స్, ఈడీ మార్ఫీ, జెర్రాడ్‌ను వెనక్కి నెట్టాడు. ఈ లిస్టులో చరణ్ రెండో స్థానంలో నిలిచాడు.

ప్రముఖ మ్యాగ్జిన్ 'వెరైటీస్' టాప్ 10 బెస్ట్ యాక్టర్ ఆస్కార్‌ ప్రిడిక్షన్స్‌ లిస్టులో ఎన్టీఆర్ చోటు సంపాదించాడు.ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు.

ఆస్కార్ రేసులో..

తారక్ తన సినీ జీవితంలో ఎన్నో సినిమాలు విజయాలు సాధించినా...నటనకు మాత్రం గుర్తింపునిచ్చింది మాత్రం RRR.

RRRతోనే గుర్తింపు

RRR చిత్రం సక్సెస్ నటుడిగా NTR స్థాయిని పెంచడంతో దోహదపడింది.   తారక్‌ను గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు రావడానికి కారణమైంది.

త్వరలోనే టాప్-10 నుంచి టాప్ 1కు చేరుకుని ఉత్తమ నటుడిగా NTR ఆస్కార్ అందుకోవాలి అని YouSay ఫ్యామిలీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.