కె విశ్వనాథ్ సినీ ప్రస్థానం :  వెండితెరపై కళాఖండాలు చిత్రీకరించిన కళాతపస్వి

YouSay Short News App

కె.విశ్వనాథ్‌ స్వస్థలం గుంటూరు జిల్లా పెదపులివర్రు. 1930 ఫిబ్రవరి 19న కాశీనాథుని సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మ దంపతులకు జన్మించారు.

లలితకళల్లో తెరపై కళాఖండాలు చిత్రీకరించిన దర్శకుడు కె విశ్వనాథ్

సినీ ప్రస్థానం

విజయవాహిని స్టూడియోస్‌లో సౌండ్ రికార్డిస్టుగా సినీరంగ ప్రవేశం..పాతాళభైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్టుగా పనిచేసిన విశ్వనాథ్

ఐదు దశాబ్దాలపాటు సినీ ప్రస్థానం కొనసాగించిన కె.విశ్వనాథ్.. 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు

తొలి సినిమా ఆత్మగౌరవం(1965)తో  డైరెక్టర్‌గా పరిచయం

'ఆత్మగౌరవం' సినిమాకు తొలి నంది అవార్డు.. చివరగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించిన కె.విశ్వనాథ్

1980 ఫిబ్రవరి 2న విడుదలైన శంకరాభరణం చిత్రంతో జాతీయస్థాయిలో గుర్తింపు

మరణంలోనూ శంకరాభరణం

శంకరాభరణం చిత్రం విడుదలై 43 ఏళ్లు పూర్తయిన రోజునే కె.విశ్వనాథ్ తుదిశ్వాస విడిచారు

నటుడిగాను గుర్తింపు

శుభసంకల్పం, ద్రోహి సినిమాల్లో కమల్‌హాసన్‌ సూచనతో నటుడిగా కె.విశ్వనాథ్ మారారు. కలిసుందాంరా, ఆడవారిమాటలకు అర్థాలే వేరులే, ఠాగూర్, నరసింహానాయుడు వంటి చిత్రాల్లో నటుడిగా ఆకట్టుకున్నారు.

బాలీవుడ్‌లోనూ సత్తా

బాలీవుడ్‌లోనూ 10 చిత్రాలకు దర్శకత్వం వహించారు. కళాతపస్వి చిత్రాల్లో సంగీతానికి  చాలా ప్రాముఖ్యత.

కె.విశ్వనాథ్ చాలా చిత్రాలకు సంగీత దర్శకులుగా కె.వి.మహదేవన్, ఇళయరాజా, ఎమ్ఎమ్ కీరవాణి ఉన్నారు.

అవార్డులు

1992లో పద్మశ్రీ, రఘుపతి వెంకయ్య పురస్కారాలు, 2017లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 5 జాతీయ అవార్డులు, 5నంది అవార్డులు, 10 ఫిల్మ్ ఫెయిర్ అవార్డులు అందుకున్నారు.