YouSay Short News App

కైకాల సత్యనారాయణ పాత్రలు

తెలుగుతెరపై మర్చిపోలేని 

తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన నవరస నటనా సార్వభౌముడు. తండ్రి పాత్రైనా, తాత క్యారెక్టరైనా,విలన్‌గా చేయమన్నా, హాస్యాన్ని పండించమన్నా ఆయనకు లేరు సాటి. ఒక సినిమాకు మరొక దాని మధ్య వ్యత్యాసం చూపిస్తూ కొన్ని వందల చిత్రాల్లో నటించి మెప్పించిన ఘనాపాటి.

దుర్యోధన, దుశ్సాసన, యముడు, ఘటోత్కచుడు ఎలాంటి పౌరాణిక పాత్రలోనైన మెప్పించగాల సామర్థ్యం కైకాల సత్యనారాయణ సొంతం.  ఈ మహా నటుడు వేసిన అద్భుతమైన పాత్రలు మీకోసం.

ఎన్టీఆర్‌కు డూప్‌

కైకాల సత్యనారాయణకు సినిమా అవకాశాలు సీనియర్ ఎన్టీఆర్ కారణంగానే వచ్చాయి. ఆయనకు ఎన్టీఆర్‌ పోలికలు ఉండటంతో డూప్‌గా చేశారు. అది గుర్తుగా పెట్టుకున్న ఆయన తర్వాత సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు. అలా సినీ ప్రస్థానం ప్రారంభమయ్యింది.

పౌరాణిక పాత్రలు

కైకాల సత్యనారాయణ పౌరాణిక పాత్రలకు పెట్టింది పేరు. ఆయనకు సూట్‌ అవ్వదు అనే అవకాశం ఇవ్వలేదు. ఎలాంటి రోల్‌నైనా తన నటన, హావాభావాలు, డైలాగ్ డిక్షన్‌తో మెప్పించాడు.

లవకుశలో భరతుడు

ఎన్టీఆర్‌ ఇచ్చి అవకాశాలను అందిపుచ్చుకొని ఆయన వేసిన పౌరణిక పాత్రల్లో మెప్పించినది భరతుడి పాత్ర. అంతకముందు శ్రీ కృష్ణార్జున యుద్ధంలో కర్ణుడి పాత్ర వేసినప్పటికీ భరతుడి రోల్‌కు మంచి పేరు వచ్చింది.

కౌరవుల పాత్రలు

ఎన్టీఆర్‌ నటించిన పౌరాణికాల్లో మంచి హిట్ నర్తన శాల. ఇందులో దుశ్సాసనుడి రోల్‌కు మంచి మార్కులు పడ్డాయి. అందులో నటించి మెప్పించింది ఎవరో కాదు కైకాలే.

శ్రీ కృష్ణావతారం సినిమాలోనూ ధుర్యోధనుడి క్యారెక్టర్‌లో నటించారు. ఇలా 100 మంది కౌరుల్లో ముఖ్యమైన ఇద్దరిలా అలరించారు. ఇందులో కూడా ఎన్టీఆర్‌ హీరో. కురుక్షేత్రం చిత్రంలోనూ ఈ పాత్రను పోషించింది కైకాల సత్యనారాయణనే.

దాన వీర శూర కర్ణ

సినీ పరిశ్రమలో ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ దాన వీర శూర కర్ణ.  ఇందులో భీముడిలా కైకాల మెప్పించారు. ఎన్టీఆర్‌ నట విశ్వ రూపానికి మిగతా ఎవ్వరి పాత్రలు కనిపించవంటే నమ్మరు.

అష్టదిక్పాలకుండ యుముండ

కైకాల పేరు వింటే గుర్తొచ్చేది యముడి పాత్ర. నిజంగా యముడనేవాడు  ఉంటే అచ్చుగుద్దినట్లుగా ఇలానే ఉంటారేమో అనిపిస్తుంది. అందులో అంతలా జీవించారు.

ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన యమగోల చిత్రంలో ఆయన చేసిన యముడి రోల్ చిరస్మరణీయం. ఆయన కంఠం, యముండా అంటూ చెప్పే  డైలాగ్‌ డెలివరీ ఎప్పటికీ గుర్తిండిపోతాయి.

ఘటోత్కచుడు

ఈ సినిమా కూడా దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి మాయజాలం. కురక్షేత్ర యుద్ధంలో గాయపడిన ఘటోత్కచుడు. ఓ చిన్న పాపను నీటి కోసం సహాయం కోరతాడు. తను చేసిన సహాయాన్ని తీర్చుకుంటానని మాటిస్తాడు.

మరో జన్మలో తనకు వచ్చే అపాయం నుంచి ఘటోత్కచుడు రక్షిస్తాడు. ఆయన ఆహార్యంతో నటించిన కైకాల పాత్రను మర్చిపోలేం. ఇందులో ఆయన చేసిన కామెడీ, యాక్షన్ సన్నివేశాలు మెప్పిస్తాయి.

విలన్‌గా హిట్‌

వీలు చిక్కినప్పుడల్లా కైకాల విలన్‌గా కూడా మెప్పించారు. కొండవీటి సింహం, యమ కింకరుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు ఉన్నాయి.

సాహస వీరుడు సాగర కన్య సినిమాలో ప్రతినాయకుడి పాత్ర అందరినీ ఆకట్టుకుంది. ఇందులో ఆయన గెటప్‌ మరో లెవల్‌లో ఉంటుంది. గడ్డంతో పాటు కళ్లజోడు పెట్టుకొని పండించిన హావాభావాలు ఆకట్టుకుంటాయి.

సత్తిపండు

మహేశ్‌ బాబు మురారీ గుర్తుందా. ఇందులో ఆయన తండ్రిగా కైకాల నటించారు. స్క్రీన్‌పైనా  తక్కువ సమయం కనిపించినప్పటికీ ఆయన నటన అద్భుతం. చిన్నపిల్లాడిలా కైకాల చెప్పిన డైలాగులు, హాస్యం ఎంతగానో అలరిస్తుంది.