ws_FvNC3YxWwAADO7L

Kantara 2: కాంతారా పార్ట్‌-2 వచ్చేస్తోంది.. రిలీజ్‌ ఎప్పుడంటే?

YouSay Short News App

ws_FybN_cgaEAACxc3

తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి దేశవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు సాధించిన సినిమా ‘కాంతార’.

ws_Fyk0m1VXoAUqDjZ

‘కాంతారా’ గతేడాది అక్టోబరులో విడుదలై భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ws_FykFJ0zX0AAui3N

భూతకోల నృత్యరూపం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించాడు.

హొంబలే ఫిల్మ్స్ నిర్మించిన కాంతార చిత్రం విజయం సాధించడంతో రెండో భాగంపై అంచనాలు పెరిగాయి.

కాంతార ప్రీక్వెల్ సినిమాపై రిషబ్ శెట్టి అప్‌డేట్ ఇచ్చేశాడు. ఆగస్టు 27 నుంచి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించాడు.

కాంతారలో చూపించింది పార్ట్ 2 అంట. ఇప్పుడు పార్ట్ 1ని తీయడానికి రెడీ అవుతున్నట్లు తెలిపాడు రిషబ్ శెట్టి.

పార్ట్ 1కి చాలా చరిత్ర ఉందట. వాటి గురించి తెలుసుకునే పనిలో ఉన్నాడు రిషబ్‌ శెట్టి. పరిశోధన కొనసాగుతోందని ఆయన వెల్లడించాడు.

భూతకోల పుట్టుక, వాటి విశిష్టత, శక్తి సామర్థ్యాలను కాంతార ప్రీక్వెల్‌లో చూపించనున్నట్లు టాక్.

ఈ ఏడాది మార్చి నుంచి రిషబ్ స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టాడట. 2024లో సినిమా విడుదల చేస్తాడట.

కాంతారకు సంగీతం అతిపెద్ద బలంగా నిలిచింది. అజనీష్ లోకనాథ్ మ్యూజిక్‌తో మెస్మరైజ్ చేశాడు.

సప్తమి గౌడ, అచ్యుత్ కుమార్, కిశోర్, ప్రమోద్ శెట్టి, తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా పలు అవార్డులను సొంతం చేసుకుంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran