Thick Brush Stroke

 ఉసిరి దీపం వెలిగిస్తే స్త్రీలకు ఇంత పుణ్యమా!

కార్తీక పౌర్ణమి

Floral Separator

కార్తీక మాసంలో వచ్చే పున్నమిని కార్తీక పౌర్ణమి అంటారు. కార్తీక పౌర్ణమి శివ, కేశవులకు ఇష్టమైన మాసం

హరి,హరులకు ఇష్టమైన మాసం కావడంతో  ఆ రోజున పూజిస్తే వారి అనుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం

కార్తీక పౌర్ణమి స్త్రీలకు అత్యంత  పూజనీయం. కార్తీక మాసం మొత్తంలో చేసే పూజలు ఒక ఎత్తు... పౌర్ణమి రోజున చేసే వ్రతాలు, పూజలు మరొక ఎత్తు

కార్తిక పౌర్ణమి దీపారాధన

పౌర్ణమి రోజు కార్తీక దీపారాధనకు విశిష్టత ఉంది. శైవ, వైష్ణవ దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తారు.

విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ముందు, తులసికోట దగ్గర, భగవంతుడి సన్నిధిలో, ఉసిరికాయల మీద దీపాలు వెలిగించాలి

ఈ దీపాల చుట్టూ ముగ్గు వేసుకుని కుంకుమ, పూలతో అంకరించుకొని వెలిగించాలి.

ఉసిరికాయ అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించినవారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.

ఉసిరి దీపం ఎందుకు వెలిగించాలి?

అంతేకాదు  కార్తీక పున్నమి రోజున ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తే.. నవగ్రహ దోషాలు తొలగిపోతాయి.

నవగ్రహాలతో పాటు సమస్త దోషాలను తొలగిపోవాలంటే ఉసిరి దీపాలు వెలిగించాలని శాస్త్రం చెబుతోంది

కార్తీక పౌర్ణమి రోజు పూజాది సమయంలో ఉసిరికాయను తీసుకుని... దానిలో నెయ్యి నిండేలా కట్ చేసుకుని.. నేతితో నింపాలి. ఆ తర్వాత వత్తులను వేసి దీపం వెలిగించాలి.

ఉసిరి దీపం ఎలా వెలిగించాలి?

ఉసిరి దీపాలు వెలిగిస్తే మహిళలు దీర్ఘసుమంగళీ యోగాన్ని పొందుతారని నమ్మకం

కార్తీక పౌర్ణమి రోజున స్త్రీల కోసం ప్రత్యేక ఉపవాసాల గురించి పురాణాలు చెబుతున్నాయి .

కార్తీక వ్రత నియమాలు

ఇలాచేయడం వల్ల కడుపు చలవ (బిడ్డలకు రక్ష) అని శాస్త్రాలు చెబుతున్నాయి.

పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, ప్రసాదాన్ని చంద్రుడికి నివేదించి, ఫలహారంగా స్వీకరించాలి

ఉపవాసంతో పాటు వృషవ్రతం,  సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం,మహీఫలవ్రతం, నానా ఫలవ్రతం, కృత్తికా వ్రతం లాంటివి ముఖ్యమైనవి.

లక్షప్రదక్షిణ,  లక్షబిల్వార్చన, లక్షవత్తులు, లక్షరుద్రం లాంటి  పూజలూ చేస్తే మహిళలు సౌభాగ్యవతిగా వర్ధిల్లుతారని విశ్వాసం